Taj Mahal Gets Notice: తాజ్ మహల్‌కి నోటీసులు.. లేదంటే జప్తు చేస్తామని హెచ్చరిక

Taj Mahal Gets Tax Notice: తాజ్ మహల్‌కి ఆగ్రా మునిసిపల్ వాటర్ సప్లై చేసినందుకు గాను సుమారు రూ. కోటి రూపాయల వరకు వాటర్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదండోయ్.. తాజ్ మహల్ ప్రాపర్టీ టాక్స్ కూడా బకాయి పడిందట.

Written by - Pavan | Last Updated : Dec 20, 2022, 04:17 PM IST
Taj Mahal Gets Notice: తాజ్ మహల్‌కి నోటీసులు.. లేదంటే జప్తు చేస్తామని హెచ్చరిక

Taj Mahal Gets Tax Notice: తాజ్ మహల్ లాంటి చారిత్రక కట్టడానికి నోటీసులా ? గడువులోగా ట్యాక్స్ చెల్లించకుంటే ఆస్తిని జప్తు చేస్తారా అని అవాక్కవుతున్నారా ? ఆశ్చర్యపోకండి.. మీరు చదివింది నిజమే. ఈ నోటీసులు ఇచ్చింది ఇంకెవరో కాదు.. తాజ్ మహల్ ఉన్న ఆగ్రా నగర మునిసిపాలిటీ విభాగం వాళ్లే పన్ను బకాయిలు కింద ఈ నోటీసులు ఇచ్చారు. తాజ్ మహల్ లాంటి పురాతన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సంబంధిత అధికారులకు ఈ నోటీసులు అందించారు. 

తాజ్ మహల్‌కి ఆగ్రా మునిసిపల్ వాటర్ సప్లై చేసినందుకు గాను సుమారు రూ. కోటి రూపాయల వరకు వాటర్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అంతేకాదండోయ్.. తాజ్ మహల్ ప్రాపర్టీ టాక్స్ కూడా బకాయి పడిందట. ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ టాక్స్ విభాగం ఉన్నతాధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తాజ్ మహల్ మునిసిపాలిటీ కార్పొరేషన్‌కి దాదాపు రూ. 1.40 లక్షలు ప్రాపర్టీ టాక్స్ చెల్లించాల్సి ఉంది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ బిల్లులు బకాయిలు పడినట్టు ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ తమ నోటీసుల్లో పేర్కొంది. 15 రోజుల్లోగా పన్నులు చెల్లించకపోతే ఆస్తిని జప్తు చేసుకుంటామని హెచ్చరించింది. 

అయితే, ఈ వివాదంపై పురావస్తు శాఖ తరపున సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందిస్తూ.. " పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే చారిత్రక కట్టడాలకు అలాంటి పన్నులు వర్తించవు " అని అన్నారు. " ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పొరపాటున ఆ నోటీసులు జారీ చేసినట్టున్నారు. వాళ్లకు అసలు విషయాన్ని వివరిస్తూ రిప్లై ఇస్తాం " అని అన్నారు. 

ఇక్కడ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్  ఇచ్చిన వివరణను పరిశీలిస్తే.. పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే చారిత్రక కట్టడాలకు ఆస్తి పన్ను, నీటి పన్ను వంటి శిస్తులు చెల్లించాల్సిన పని లేదని అర్థమవుతోంది. మరోవైపు ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆస్తిని జప్తు చేసుకుంటామని స్పష్టంచేసింది. ఇంతకీ వీళ్లిద్దరిలో ఎవరు కరెక్ట్ ? ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ నోటీసుల ప్రకారం 2020-21 సంవత్సరం వరకు తాజ్ మహల్‌కి పన్నులు చెల్లించారా ? ఆ తరువాతే తాజ్ మహల్ వైపు నుంచి బకాయిలు పడ్డాయా ? అనే సందేహాలు కూడా రాకమానవు.

ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?

ఇది కూడా చదవండి : Bullet Bike Caught Fire: తగలబడిన బుల్లెట్ బైక్.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Cockroach Found in Omelette: రైల్లో ఆహారం తింటున్నారా ? ఆమ్లెట్‌లో బొద్దింకపై ప్రధానికి ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News