Monkey Festival : అక్కడ నిర్వహించే కోతుల పండుగ ఎంతో స్పెష‌ల్..

Monkey fruit festival : థాయిలాండ్‌లోని లోప్‌ బురి ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివ‌ల్ జరుగుతుంది. ఈ పండుగ ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ చివ‌రి వారంలో జ‌రుగుతూ ఉంటుంది. అయితే గ‌త రెండేళ్లుగా కోవిడ్ వ‌ల్ల ఈ కోతుల పండుగ నిర్వహించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ ఫెస్టివ‌ల్‌ నిర్వహిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2021, 04:53 PM IST
  • థాయ్‌లాండ్‌లో కోతుల పండుగ
  • వేలాదిగా చేరుకుంటున్న కోతులు
  • వేలాదిగా తరలివస్తున్న సందర్శకులు
Monkey Festival : అక్కడ నిర్వహించే కోతుల పండుగ ఎంతో స్పెష‌ల్..

Thailand's Monkey Festival Returns After Two Years, Draws In Tourists :ప్రపంచంలో కొన్నిచోట్ల కొన్ని వింత ఆచారాలుంటాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేక పండుగలు నిర్వహిస్తుంటారు. అలా ఒక చోట కోతుల పండుగను కూడా నిర్వ‌హిస్తారు. ఇక కోతుల పండుగ రోజు గుంపులు గుంపులుగా వేలాది కోతులు అక్క‌డికి చేరుకుంటాయి. వాటికి కావాల్సిన ఆహార ప‌దార్థాల‌ను సందర్శకులు అందిస్తారు. ఈ పండుగను చూసేందుకు వేలాది మంది సందర్శకులు కూడా అక్క‌డికి చేరుకుంటారు. 

థాయిలాండ్‌లోని (Thailand) లోప్‌ బురి ప్రాంతంలో ఈ మంకీ ఫెస్టివ‌ల్ జరుగుతుంది. ఈ పండుగ ప్ర‌తి ఏటా న‌వంబ‌ర్ చివ‌రి వారంలో జ‌రుగుతూ ఉంటుంది. అయితే గ‌త రెండేళ్లుగా కోవిడ్ వ‌ల్ల ఈ కోతుల పండుగ నిర్వహించలేదు. మళ్లీ ఇప్పుడు ఆ ఫెస్టివ‌ల్‌ నిర్వహిస్తున్నారు. 

ఈ ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా కోతుల కోసం ట‌న్నుల కొద్దీ పండ్లు.. కూర‌గాయ‌ల‌ను తరలిస్తారు. ఇక ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆ ప్రాంతానికి ర‌క‌ర‌కాల జాతుల‌కు చెందిన కోతులు కూడా వ‌స్తాయట‌. అవన్నీ కూడా సందర్శకులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా వారితో సరదాగా గడుపుతాయి. టూరిస్టులు ఇచ్చే ఆహారాన్ని తింటూ స‌ర‌దాగా గ‌డుపుతాయి. 

Also Read : Omicron In Australia: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కలకలం.. ఇద్దరు ప్రయాణికులకు పాజిటివ్

అయితే ఈ మంకీ ఫెస్టివ‌ల్ (Monkey Festival) ఏటా ఏదో ఒక థీమ్‌తో నిర్వ‌హిస్తారు. ఈసారి వీల్‌చైర్ మంకీస్ (wheelchair monkeys) అనే థీమ్‌తో మంకీస్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హిస్తున్నారు. అక్కడ అవ‌స‌రం ఉన్న వారికి ఈ సారి వీల్‌చైర్ల‌ను ఉచితంగా అందించనున్నారు. ఇక ఈ ఫెస్టివ‌ల్ కోస‌ం థాయిలాండ్ ప్ర‌భుత్వం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. కోవిడ్ వాక్సినేష‌న్ వేసుకున్న టూరిస్టులు క్వారంటైన్ (quarantine) లేకుండానే ఈ ఫెస్టివ‌ల్‌ను చూసేందుకు అనుమతి ఇచ్చింది.

Also Read : Bandla Ganesh: బండ్ల గణేష్ గొప్ప మనసు-నేపాలి చిన్నారిని దత్తత తీసుకున్న నిర్మాత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News