Tiger Drags Woman: యువతిని ఆటబొమ్మలా అడవిలోకి లాక్కెళ్లిన పులి.. షాకింగ్ వీడియో వైరల్

Viral Video of Tiger Dragging Woman : యువతిని పులి లాక్కెళ్లడం చూసి వాహనంలో ఉన్న వారు భయం భయంగానే దిగి అటువైపు పరుగెత్తినట్టుగా వీడియోలో కనిపిస్తోంది కానీ ఆ తరువాత ఏం జరిగింది అనే వివరాలు మాత్రం లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 12:23 AM IST
Tiger Drags Woman: యువతిని ఆటబొమ్మలా అడవిలోకి లాక్కెళ్లిన పులి.. షాకింగ్ వీడియో వైరల్

Viral Video of Tiger Dragging Woman: అడవిలో మృగరాజుగా తిరిగే పులి ఎంతటి శక్తివంతమైన జంతువో అందరికీ తెలిసిందే. పులి పంజా విసిరిందంటే.. అదృష్టం బలంగా రాసిపెట్టి ఉంటేనో లేక భూమ్మీద ఇంకా నూకలు బాకీ ఉంటేనో తప్ప ఇక బతికి బట్ట కట్టడం కూడా చాలా అరుదే. అడవిలో పులుల మధ్య తిరిగి వేగంగా పరుగెత్తే అడవి జంతువులే పులి ముందు తోకముడుస్తాయి. జింకలు, అడవి పందులు, అడవి దున్నలు వంటి జంతువులను పులులు వేటాడే వీడియోలను ఇంటర్నెట్లో అనేకం చూసే ఉంటారు. అలాంటిది మనిషిపై పులి దాడి చేస్తే ఇంకేమైనా ఉందా ? వినడానికే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా.. మరి ఆ సీన్ ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు, పులి పంజాకు దొరికిన వాళ్లకు ఇంకెంత ఒళ్లు జలదరించి ఉంటుందో ఊహించుకోండి.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నిశితంగా పరిశీలిస్తే.. అది సఫారిలో షూట్ చేసిన వీడియోలా ఉంది. ఆ వీడియోలో ఓ యువతి ముందు ఆగి ఉన్న కారు డ్రైవింగ్ సీటులోంచి దిగి అవతలి వైపు డోర్ దగ్గరకు వెళ్లింది. అవతలి వైపు సీటులో ఉన్న వారు దిగి ఆమె లోపలికి ఎక్కాల్సి ఉండగా.. ఆ లోపే యువతి వెనకవైపు నుంచి వచ్చిన ఓ పెద్ద పులి యువతిని నోట కర్చుకుని అడవిలోకి పారిపోయింది. వెనకవైపున్న వాహనాల్లో ఉన్న వారు పులి యువతి వైపు రావడం గమనించి బిగ్గరగా అరిచారు. వారి అరుపులు విన్న యువతి వెనక్కి తిరిగి చూసేలోపే పులి ఆమెను నోట కర్చుకుని వచ్చిన వేగంతోనే వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయింది. ఇది చూసిన జనం నిలువునా వణికిపోయారు. వీడియో చూసిన నెటిజెన్స్ సైతం తీవ్ర భయాందోళనకు గురవుతూ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు.

 

యువతిని పులి లాక్కెళ్లడం చూసి వాహనంలో ఉన్న వారు భయం భయంగానే దిగి అటువైపు పరుగెత్తినట్టుగా వీడియోలో కనిపిస్తోంది కానీ ఆ తరువాత ఏం జరిగింది అనే వివరాలు మాత్రం లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతం గుండా వెళ్లేటప్పుడు, సఫారీల్లో సంచరించేటప్పుడు పులులు, క్రూరమైన వణ్యమృగాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ అటవీ శాఖ అధికారులు ఎక్కడికక్కడ హెచ్చరికలు చేస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ జనం తమ నిర్లక్ష్యంతోనే ఇలా ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు అని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి :  Why Birds Won't Get Shock: కరెంట్ తీగలపై పక్షులకు ఎందుకు షాక్ తగలదో తెలుసా ?

ఇది కూడా చదవండి : Tiger Viral Video: రోడ్డు దాటేందుకు తిప్పలు పడుతున్న టైగర్ వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News