Tricolor Waterfall: అది మువ్వన్నెల జండా కాదు..మూడు రంగుల జలపాతం, వైరల్ అవుతున్న వీడియో

Tricolor Waterfall: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాలు ప్రతి ఇంటానే కాకుండా జలపాతాల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి.. ఆ అద్బుత దృశ్యం చూద్దామా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 10, 2022, 06:50 PM IST
Tricolor Waterfall: అది మువ్వన్నెల జండా కాదు..మూడు రంగుల జలపాతం, వైరల్ అవుతున్న వీడియో

Tricolor Waterfall: దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాలు ప్రతి ఇంటానే కాకుండా జలపాతాల్లోనూ ప్రతిబింబిస్తున్నాయి.. ఆ అద్బుత దృశ్యం చూద్దామా..

దేశపు 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఈ వీడియా ఆసక్తి కల్గిస్తోంది. వైరల్ అవుతోంది. చూసేకొద్దీ మళ్లీ మళ్లీ చూడాలన్పించే అద్భుత దృశ్యమిది. ఇదొక మువ్వన్నెల జెండా కాదు..మువ్వన్నెల జలపాతం. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. జలపాతం నుంచి మూడు రంగుల్లో జాలువారుతున్న నీటి దృశ్యం అద్భుతంగా ఉంది.

దేశమంతా ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం వజ్రోత్సవ వేడుకలకు సమాయత్తమౌతోంది. దేశమంతా హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలని ప్రచారం చేస్తున్నారు. ఊరూరా జాతీయ జెండాలు పంచుతూ ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆగస్టు 15 వేడుకలకు అటు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు..మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తోంది. 

మువ్వన్నెల జలపాతమిది

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొండప్రాంతం నుంచి జలపాతం వచ్చి పడుతోంది. ఇదేదో మామూలు జలపాతం కాదు. మువ్వన్నెల జలపాతమిది. జలపాతం పడుతుంటే..అచ్చం జాతీయ జెండాలానే ఉంది. పైనుంచి పడుతున్న జలపాతం ఓ వైపు కాషాయం, మధ్యలో తెలుపు నీటి రంగు ఇటు చివర ఆకుపచ్చలో నీటి ధారలు పడుతుంటే..మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తోంది. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు జనం ఎగబడుతున్నారు. కెమేరాలు, స్మార్ట్‌ఫోన్లలో బంధిస్తున్నారు. నిజంగానే ఈ వీడియో అద్భుతంగా ఉంది.

మువ్వన్నెల జలపాతం చూసేందుకు స్థానికులు కూడా పెద్దఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఆగస్టు 15 పురస్కరించుకుని ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలోని ప్రతి వేదికపై ఈ వీడియో షేర్ అవుతోంది. 

Also read: 75th Independence Day: దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్మరించుకోదగిన సమరయోధులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News