Wedding Viral: ఫస్ట్ నైట్ రోజు వరుడి అత్యుత్సాహం... ఇదేం కరువురా అంటూ ఏకీపారేస్తున్న నెటిజన్లు..

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో యువతీ, యువకుల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. బరాత్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఉరై గ్రామంలో యువతి,వరుడి ఇంటికి వెళ్లింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2024, 07:31 PM IST
  • - ఫస్ట్ నైట్ లో వధువు పట్ల మోరటుగా ప్రవర్తించిన వరుడు..
    - తీవ్ర రక్త స్రావంతో ఆస్పత్రిపాలైన యువతి..
 Wedding Viral: ఫస్ట్ నైట్ రోజు వరుడి అత్యుత్సాహం... ఇదేం కరువురా అంటూ ఏకీపారేస్తున్న నెటిజన్లు..

Husband Consumes Viagra Pills On First Night: మనలో చాలా మంది పెళ్లంటే ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. లైఫ్ లో ఒక్కసారే చేసుకుంటారు కాబట్టి ప్రతి వేడుకు కూడా జీవితంలో మర్చిపోలేని విధంగా ఉండాలనుకుంటారు. దీని కోసం యువత ఎంతఖర్చైన చేయడానికి కూడా వెనుకాడటం లేదు. వెడ్డింగ్ బ్యూరోలను కూడా కలుస్తున్నారు. ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతి వేడుక కూడా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. తమను సరిగ్గా అర్థం చేసుకునే జీవిత స్వామి, భార్యగా దొరకాలని ప్రతిఒక్కరు ఆశపడుతుంటారు.

Read More: Belly fat: బెల్లిఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ టిప్స్ డైలీ పాటిస్తే వారంలో చెక్ పెట్టేయోచ్చు..

ఎన్నో కలలు, గొప్ప ఆశలతో పెళ్లితర్వాత మంచి లైఫ్ ను ప్రారంభించాలను కుంటారు. కానీ మరికొందరు మాత్రం.. వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడి పెళ్లి, భార్య అంటే ఏదో శృంగారం కోసం మాత్రమే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. సినిమాల్లోని సీన్ లను నిజజీవితంలో ఊహించుకుని తమ  జీవితభాగ స్వామిపట్ల షాడిస్టుల మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. ఒక నవవధువుకు ఫస్ట్ నైట్ రోజు, దారుణమైన అనుభవం కలిగేలా ప్రవర్తించాడు. దెబ్బకు యువతి ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని హమీర్ పూర్ పరిధిలో ఉరై గ్రామం ఉంది. ఇక్కడ ఒక యువకుడికి ఈనెల మూడో తేదినన పెళ్లి జరిగింది. పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరిపించారు. అయితే.. ఫిబ్రవరి ఏడున ఇంట్లో కొత్త జంటకు ఫస్ట్ నైట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ యువకుడు... అత్యుత్సాహంతో తొలిరాత్రి భార్యతో ఎక్కువగా ఎంజాయ్ చేయాలని కామోద్దీపం కల్గించే మాత్రలను వేసుకున్నాడు.మోతాదుకు మించి వాడినట్లు సమాచారం. రాత్రంతా వధువుపట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. దీంతో వధువుకు తీవ్ర రక్తస్రావం జరిగింది.

Read More: Nayanatara: భర్త సినిమాని సైతం వదులుకున్న నయనతార ..రెమ్యూనరేషన్ కోసమేనా!

వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాన్పూర్ కు కూడా తరలించారు. ఈక్రమంలో యువతికి ఎక్కువగా రక్తస్రావం అవ్వడం, ఇన్ఫెక్షన్ కు గురికావడం వల్ల ఐసీయూలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి పదిన కన్నుమూసింది. వరుడు అతిగా సంభోగ మాత్రలు వేసుకుని, విచ్చల విడిగా ప్రవర్తించడం వల్ల యువతికి రక్తస్రావమై చనిపోయినట్లు తెలుస్తోంది. యువతి కుటుంబ సభ్యులు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువకుడిని నెటిజన్లు.. నువ్వు మనిషివేనా.., కరువులో ఉన్నావా.. అంటూ ఏకీపారేస్తున్నారు. ఈ విషాదకర ఘటన మాత్రం యూపీలో సంచలనంగా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News