Komodo Dragon eating baby goat: కొమోడో డ్రాగన్ గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అవి చాలా డేంజరస్. వీటిని డైనోసార్ బల్లి లేదా రాకాసి బల్లి లేదా కొమోడో మానిటర్ లేదా భూమి మొసలి అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఇది గరిష్టంగా 3 మీ పోడవు మరియు 70 కిలోల బరువు ఉంటుంది. ఈ కొమోడో డ్రాగన్‌లను 1910లో మొదటిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకప్పుడు అడవుల్లో ఉండే ఈ పెద్ద బల్లులు ఇప్పుడు ఓన్లీ జూ ల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. దానికి కారణం మనుషులు విచక్షణారహితంగా అడవులను నరికివేయడమే. ప్రస్తుతం ఈ జంతువులు IUCN రెడ్ లిస్ట్ లో అంతరించపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి.
కొమోడో డ్రాగన్‌లు ఎక్కువగా పక్షులు, పక్షి గుడ్లు, చిన్న క్షీరదాలు, కోతులు, అడవి పంది , మేకలు, పందులు మరియు జింకలను తింటాయి. ఇవి అప్పుడప్పుడు మనుషులపై దాడి చేస్తాయి. అయితే ఈ కొమోడోలు మనుషులకు దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. వాతావరణ మార్పులు వీటి జనాభా తగ్గిపోవడానికి మరోక ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే తాజాగా కొమోడో డ్రాగన్ ఓ మేక పిల్లను అమాంతం నోటితో మింగేసిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ వచ్చాయి. వేల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Also Read: Post-wedding Photoshoot: నగ్నంగా పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసిన కేరళ జంట..వైరల్ అవుతున్న ఫొటోస్..
Also read:Viral Video today: ఈ బుడ్డది మామూల్దీ కాదు.. ఏకంగా 7 భాషలు తడబడకుండా మాట్లాడేస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook