Peacock vs Goat Viral Video: నెమలి వర్సెస్ మేకపోతు ఘర్షణలో పైచేయి ఎవరిదుంటుంది. కచ్చితంగా మేకపోతే కదా. అక్కడ జరిగిన మేకపోతు వర్సెస్ నెమలి పోరాటంలో ఏం జరిగింది..ఆ వీడియో ఎందుకు వైరల్ అయిందనేది చూద్దాం
సోషల్ మీడియాలో వివిధ సందర్భాల్లో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సహజంగానే జంతువులు, పక్షుల వీడియోలు ఇంటర్నెట్లో హిట్ అవుతుంటాయి. ప్రతిరోజూ క్రేజీ క్రేజీ, ఫన్నీ ఫన్నీ వీడియోలు వైరల్ అయి మెరుస్తుంటాయి. అటువంటిదే ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదంతా ఓ నెమలికి మేకపోతుకు మధ్య జరిగిన పోరాటం వీడియో. ఆశ్చర్యంగా ఉందా. నిజమే మీరూ చూడండి మరి.
अपनी सामर्थ्य पर हमेशा भरोसा करें,
ईश्वर ने सभी को मुसीबतों से टकराने योग्य बनाया है.#सुप्रभात pic.twitter.com/AgD9lxC4OQ— Dipanshu Kabra (@ipskabra) February 28, 2022
ఓ అటవీ ప్రాంతంలో మేకపోతు, నెమలి ఎదురెదురవుతాయి. ఇంకేం..రెండింటి మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. నెమలి ఏకంగా మేకపోతుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో మేకపోతు తన కొమ్ములతో డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాస్త ఫన్నీగా, మరికాస్త ఆసక్తిగా..నవ్వు తెప్పించేందిగా ఉంది ఈ వీడియో. ఐపీఎస్ అధికారి దీపాన్షు కాబ్రా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌పై షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనికాయన మంచి క్యాప్షన్ కూడా పెట్టారు. ఎప్పుడూ నీ బలాన్ని నమ్ముకో..ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడేలా ప్రతి ఒక్కరినీ ఆ దేవుడ తీర్చి దిద్దాడు. ఇదే ఆ క్యాప్షన్.
ఈ వీడియో వైరల్ అయింది. 2 వందలకు పైగా రీట్వీట్స్, 16 వేలకు పైగా వ్యూస్ 15 వందల లైక్స్‌తో పరుగెడుతోంది. వాట్ ఎ ఫెంటాస్టిక్ ఫైట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ దశలో నెమలి పోరాట స్ఫూర్తిగా అంతటి బలమైన మేకపోతు కూడా వెనుకడుగేసిన పరిస్థితి. అందరూ ఊహించినట్టుగా మేకపోతుది కాదు విజయం. అందంలోనే కాదు..పోరాటంలోనూ నేనే అంటోంది నెమలి.
Also read: Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook