Man Dies After Bitten By His Pet Lizard: చాలా మంది ఇంట్లో ఏదో రకమైన పెంపుడు జంతువులను పెంచుతుంటారు. కుక్కలు, పిల్లులు, ఏనుగులన కొందరు పెంచుకుంటారు. మరికొందరు రామచిలుకలు కూడా పెంచుకుంటారు. మరికొందరు హనికరమైన పాములు, కొండచిలువలు, బల్లులును ఇంట్లో పెంచుకుంటారు. సీక్రెట్ గా కొందరు క్రూర జంతువులను కూడా పెంచుకునే వారు లేకపోలేదు.
Read More: Dhanush - Captain Miller OTT News: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ధనుశ్ కెప్టెన్ మిల్లర్ మూవీ..
కొన్నిసార్లు ఇవి తమ ఓనర్స్ తో విశ్వాసంగా ఉన్న.. మరికొన్నిసార్లు తిరగబడుతుంటాయి. తమ యజమానిపైనే దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో పెంపుడు జీవుల చేతిలో, ఓనర్స్ ప్రాణాలు కోల్పోయిన అనేక ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. తాజాగా, యూస్ లో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. గిలా అనేవి విషపూరిత బల్లులు, ఇవి 54 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అవి భారీ, నెమ్మదిగా కదిలే సరీసృపాలు. యుఎస్‌లోని గిలా నది పేరు మీద బల్లి పేరు పెట్టారు.
అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో జెఫెర్సన్ కౌంటీ అనే వ్యక్తి తన ఇంట్లో గిలా జాతీకి చెందిన బల్లులను పెంచుకున్నాడు. ఇవి పూర్తిగా మాంసాన్ని తింటాయి. ఇది బల్లిజాతీకి చెందిన జీవి. అయితే.. మన ఇళ్లలో ఉండే బల్లులు చిన్నవిగా ఉంటాయి. ఇవి దాదాపు కాలు వేయడం,కొరకడం చేయవు. కానీ ఇవి పడిన ఆహరం తింటే మాత్రం ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. అయితే.. గిలా బల్లిని కాటు వల్ల జెఫెర్సన్ కౌంటీ తన ప్రాణాలు కోల్పోయాడు.
ఇది 54 అంగుళాల పొడవు పెరుగుతుంది. ఒకరోజు జెఫెర్సన్ కౌంటీని గిలా కాటు వేసింది. ఈక్రమంలో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిపొయాడు. ఆస్పత్రికి తరలించిన తర్వాత.. వైద్యులు అతడిని టెస్టులు చేసి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అతని శరీరం రంగులో మార్పు వచ్చింది. బల్లి కాటు వల్ల అతనుచనిపోయినట్లు పోస్టు మార్టం రిపొర్టులో బైటపడింది. కొలరాడోలో లైసెన్స్ లేకుండా గిలా బల్లిని పెంపుడు జంతువుగా ఉంచడం చట్టవిరుద్ధమని సమాచారం.
కొలరాడో పార్క్స్, వైల్డ్‌లైఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేటర్ లు మాట్లాడుతూ.. రెండు గిలా బల్లులను ఇంటి నుండి తొలగించమని కోరినట్లు సమాచారం. ఈ సరీసృపాలు మరొక రాష్ట్రంలోని వన్యప్రాణుల పునరావాస కేంద్రానికి తీసుకువెళతారు. కానీ.. ఒక వేళ ఇది మనిషిని కరిస్తే జంతువును ముందుగా ల్యాబ్‌కు తీసుకెళ్తారు.
Read More: Anchor Anasuya: ఏం అందం మావ.. వెకేషన్ పిక్స్‌తో పిచ్చెక్కించిన అనసూయ..!
అక్కడ, దాని కాటు దాని యజమాని మరణానికి ఎందుకు దారితీసింది అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి దాని విషం సంగ్రహించి, అధ్యయనం చేస్తారు. దీని కాటు జరిగిన ప్రదేశంలో విపరీతమైన రక్తస్రావం జరగటం పాటు, శరీరం మొత్తం విషపూరీతంగా మారిపోయి, రక్తం గడ్డకడుతుందని వైద్యులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook