Viral Video: బాత్‌రూమ్‌లో బెడిసికొట్టిన ప్రాంక్.. బాయ్‌ఫ్రెండ్ పంచ్‌కి విలవిల్లాడిన గర్ల్‌ఫ్రెండ్

Girlfriend Prank on Boyfriend: బాయ్‌ఫ్రెండ్‌ను ఆటపట్టించేందుకు ఓ గర్ల్‌ఫ్రెండ్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతన్ని భయపెట్టేందుకు ప్రయత్నించి అతని పంచ్ దెబ్బ రుచి చూసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 03:35 PM IST
  • బాయ్‌ఫ్రెండ్‌పై గర్ల్‌ఫ్రెండ్ ప్రాంక్
  • బెడిసినకొట్టిన ప్రాంక్.. వీడియో వైరల్..
  • బాయ్‌ఫ్రెండ్ పంచ్‌కి విలవిల్లాడిపోయిన గర్ల్‌ఫ్రెండ్
 Viral Video: బాత్‌రూమ్‌లో బెడిసికొట్టిన ప్రాంక్.. బాయ్‌ఫ్రెండ్ పంచ్‌కి విలవిల్లాడిన గర్ల్‌ఫ్రెండ్

Girlfriend Prank on Boyfriend: సోషల్ మీడియాలో నిత్యం బోలెడు ప్రాంక్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ప్రాంక్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో చాలామంది యూట్యూబర్స్, సోషల్ మీడియా యూజర్స్ వీటిని ట్రై చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ ప్రాంక్ వీడియోలు బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. ఇలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ని ఆటపట్టించేందుకు ప్రయత్నించి చివరకు బాధితురాలిగా మిగిలిపోయింది.

ఆ వీడియోని గమనిస్తే... ఓ వ్యక్తి టాయిలెట్‌ కమోడ్ వద్దకు వెళ్లి మూత్ర విసర్జనకు సిద్ధమవుతుండగా.. పక్కనే ఉన్న కర్టైన్‌ సడెన్‌గా కదలడంతో పాటు చిన్నపాటి సౌండ్ వినిపిస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అతను ఆ కర్టైన్‌పై గట్టిగా పంచ్ ఇచ్చేశాడు. అంతే.. ఆ వెంటనే కర్టైన్ వెనుక నుంచి ఓ ఏడుపు.. దాన్ని పక్కకు తప్పించి చూస్తే.. అక్కడ ఉన్నది అతని గర్ల్‌ఫ్రెండ్.

పాపం బాయ్‌ఫ్రెండ్‌ను సరదాగా ఆటపట్టించాలనుకున్న ఆ గర్ల్‌ఫ్రెండ్ అతని పిడిగుద్దుకు విలవిల్లాడిపోయింది. 'అమేజర్ కీస్' అనే ఇన్‌స్టా యూజర్ ఖాతాలో ఈ వీడియో అప్‌లోడ్ అవగా ఇప్పటివరకూ 11 లక్షల మంది దీన్ని వీక్షించారు. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ వీడియోలు ఫన్నీగా ఉండాలే కానీ.. భయపెట్టేందుకు ట్రై చేస్తే ఇలాగే ఉంటుందని పలువురు కామెంట్ చేశారు. కొంతమంది ఇది రియల్ ప్రాంక్ అని కామెంట్ చేయగా... మరికొందరు ఫేక్ ప్రాంక్ అని కామెంట్ చేయడం గమనార్హం. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anthony “A-Major” Russell (@amajor.keys)

Also Read: IPL 2022 Auction: అయ్యోరామ ఎంతపనాయే.. వేలంలో పాల్గొంటే 20 కోట్లు వచ్చేవి!!

Aslo Read: Liam Livingstone: లియామ్ లివింగ్‌స్టోన్‌పై కాసుల వర్షం.. సన్‌రైజర్స్‌తో పోటీపడి కొనుగోలు చేసిన పంజాబ్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News