Woman Dance Video: మైకెల్ జాక్సన్‌ను తలపించే బ్రేక్ డ్యాన్స్.. ఆ మహిళ టాలెంట్‌కి సోషల్ మీడియా ఫిదా

Woman Dancing Like Michael Jackson: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది తమ టాలెంట్‌ని బయటపెట్టుకుంటున్నారు. అందుకే సింగింగ్, డ్యాన్సింగ్‌, యాక్టింగ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వీడియోలు కనిపిస్తుంటాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 05:26 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మహిళ డ్యాన్స్ వీడియో
  • హృతిక్ రోషన్ పాటకు స్టెప్పులేసిన మహిళ
  • ఫిదా అవుతోన్న నెటిజన్లు
Woman Dance Video: మైకెల్ జాక్సన్‌ను తలపించే బ్రేక్ డ్యాన్స్.. ఆ మహిళ టాలెంట్‌కి సోషల్ మీడియా ఫిదా

Woman Dancing Like Michael Jackson: సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది టాలెంట్ వెలుగులోకి వస్తోంది. మహా మహా గాయకులను, డ్యాన్సర్లను తలపించే రీతిలో సాదాసీదా వ్యక్తులు తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. గతంలో రాను మండల్ అనే మహిళ అచ్చు లతా మంగేష్కర్‌ను తలపించేలా పాడి ఓవర్ నైట్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి టాలెంట్ అడపాదడపా వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా ఓ మహిళ మైకెల్ జాక్సన్‌ను తలపించేలా చేసిన బ్రేక్ డ్యాన్స్‌కు సోషల్ మీడియా ఫిదా అవుతోంది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 'ఏక్ పాల్ కా జీనా' పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. ఆ పాటకు అచ్చు హృతిక్ రోషన్ లాగే స్టెప్పులు వేసింది. ఓ బట్టల దుకాణంలో ఆమె ఈ డ్యాన్స్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాను మండల్‌కి అక్క దొరికిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ఆమెను ఇండియన్ ఐడల్‌కి పంపించాలంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. 

కాబోయే సెలబ్రిటీ అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మీమ్స్ సెంట్రల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 'ఆంటీజీ రాక్‌స్టార్' అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇప్పటివరకూ ఈ వీడియోకి 3989 వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద ఆ మహిళ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MEMES KI DUKAN 🔥 (@memecentral.teb)

 

Also Read: Amazon Sale: అమెజాన్​ స్పెషల్ ఆఫర్​- వన్​ప్లస్​ 5జీ ఫోన్​పై రూ.16,400 వరకు తగ్గింపు!

 

Also read: Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్ సూపర్​ ఆఫర్​- రూ.14,999కే వన్​ప్లస్ స్మార్ట్​ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News