Wife Drinking Alcohol: ఆల్కాహాల్‌ తాగి భర్తను వేధించొద్దు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Wife Eating Gutkha and Drinking Alcohol: భర్త తప్ప తాగి ఇంటికొచ్చి భార్యను ముప్పుతిప్పలు పెట్టడం సర్వసాధారణం. పాపం అలాంటి భర్త చేతిలో ఆ భార్య పడే నరకయాతన అంతా ఇంతా కాదు. పెళ్లి అయ్యాకే తన భర్త అసలు రంగు ఏంటో తెలిసింది అని బాధితురాలు చెప్పుకోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో మాత్రం సీన్ రివర్స్ అయింది. భార్యే తప్ప తాగి భర్తకు చుక్కలు చూపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 07:25 PM IST
Wife Drinking Alcohol: ఆల్కాహాల్‌ తాగి భర్తను వేధించొద్దు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Wife Eating Gutkha and Drinking Alcohol: ఇదొక వింత కేసు. ఇలాంటి తాగుబోతు భార్యతో నేను వేగలేను మొర్రో అంటూ ఒక భర్త ఫ్యామిలీ కోర్టు, హైకోర్టు చుట్టూ తిరిగి మరీ న్యాయపోరాటం చేసి గెలిచిన కేసు. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన ఒక భర్తకు ఎదురైన చేదు అనుభవం ఇది. అమ్మాయి గుణగణాల గురించి ఆమె తల్లిదండ్రులు దాచిపెట్టి చేసిన ఒక పెళ్లి అతడి జీవితాన్ని ఇరకాటంలో పడేసింది. అదేంటి సాధారణంగా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు తాగి వచ్చే భర్త చేతిలో భార్యకు ఎదురయ్యే ఇబ్బందులు కదా అని అనుకుంటున్నారా ? ఫర్ ఏ చేంజ్.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. మొత్తం కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి.

భర్త తప్ప తాగి ఇంటికొచ్చి భార్యను ముప్పుతిప్పలు పెట్టడం సర్వసాధారణం. పాపం అలాంటి భర్త చేతిలో ఆ భార్య పడే నరకయాతన అంతా ఇంతా కాదు. పెళ్లి అయ్యాకే తన భర్త అసలు రంగు ఏంటో తెలిసింది అని బాధితురాలు చెప్పుకోవడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో మాత్రం సీన్ రివర్స్ అయింది. భార్యే తప్ప తాగి భర్తకు చుక్కలు చూపిస్తోంది. అంతటితో సరిపోదు అన్నట్టుగా గుట్కా కూడా తిని బెడ్ రూమ్ అంతా ఇష్టం వచ్చినట్టుగా ఉమ్మేయడం మొదలుపెట్టింది. దీంతో ఆమె పెడుతున్న టార్చర్ భరించలేనంటూ అతడు విడాకుల కోసం కోర్టుకు ఎక్కాడు. అంతకంటే ముందుగా జరిగిన ఇంకొన్ని ఘటనల గురించి తెలిస్తే మీరు అవాక్కవడం పక్కా.

ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బా జిల్లాలో ఒక తాగుబోతు భార్య చేతిలో భర్తకు ఎదురైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంకిమోగ్రా జిల్లాకు చెందిన యువకుడికి కట్గోరాకు చెందిన అమ్మాయికి 2015 మే నెలలో వివాహమైంది. పెళ్లయిన వారం రోజుల తరువాత మే 26న మొదటిసారిగా భార్య చేతిలో తనకు షాక్ తగిలిందటూ తనకు ఎదురైన ఘటనల గురించి చెప్పుకొచ్చాడు ఆ యువకుడు. పని మీద బయటికెళ్లిన తాను ఇంటికి తిరిగొచ్చేసరికి భార్య బెడ్ పై స్పృహ లేకుండా పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాక తాను ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. అప్పుడే మొదటిసారి తెలిసింది ఆమె మద్యానికి బానిసైందని.. మద్యానికి తోడు నాన్-వెజ్, గుట్కా తినే అలవాటు కూడా ఉందని. ఆ విషయం తెలిసి తమ కుటుంబం అంతా నివ్వెరపోయిందని యువకుడు వాపోయాడు.

కోడలి దురలవాట్లను మాన్పించేందుకు ఆ కుటుంబం ఆమెకు ఎంతో నచ్చచెప్పి చూసింది. కానీ అత్తింటి వారి మాటలకు హర్ట్ అయిన కోడలు.. ఆ తరువాతి నుంచి వారితో మిస్‌బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. గుట్కా తిన్న తరువాత బెడ్ రూమ్ లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం మొదలుపెట్టింది. అలా చేయొద్దని చెప్పిన భర్తతో ఘర్షణకు దిగడం షురూ అయింది. అదే ఏడాది డిసెంబర్ 30న తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మరో రెండుసార్లు ఇల్లు స్లాబ్ ఎక్కి దూకింది. మరో రెండుసార్లు పురుగుల మందు సేవించి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అదృష్టవశాత్తుగా ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. 

భార్య సూసైడ్ అటెంప్ట్స్ చూసిన భర్త.. ఆమె పెట్టే వేధింపులకు తోడు ఆమె సూసైడ్ చేసుకుంటే అది తనపైకి వస్తుందనే భయంతో ఫ్యామిలీ కోర్టులో డైవర్స్‌కి అప్లై చేశాడు. కానీ భర్త చేసిన ఫిర్యాదును తిరస్కరించిన ఫ్యామిలీ కోర్టు.. డైవర్స్ పిటిషన్‌ని కొట్టేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ భార్య బాధితుడు.. ఈసారి ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ చత్తీస్‌ఘడ్ హై కోర్టును ఆశ్రయించాడు. భర్త పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన హై కోర్టు.. అంతకంటే ముందు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ అతడికి విడాకులు మంజూరు చేసింది. తప్పతాగే అలవాటున్న భార్య చేతిలో అతడు వేధింపులకు గురవుతున్నట్టు గుర్తించిన కోర్టు.. అతడికి డైవర్స్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి : Leopard Attacks on Vehicle: వాహనంలో వెళ్తున్న వారిపైకి దూకిన చిరుతపులి.. వీడియో వైరల్

ఇది కూడా చదవండి : Lockdown in India: ఇండియాలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ? ఇందులో నిజమెంత ?

ఇది కూడా చదవండి : Men Protested For Brides: నా వధువు ఏమైందంటూ కలెక్టరేట్ ఎదుట 50 మంది ధర్నా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News