Matrimony Cheating Case: ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 50 మందికి పైగా అమ్మాయిలను పెళ్లి పేరిట మోసం ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విగ్గులు పెట్టుకుని నవ యవ్వనంగా కనిపిస్తూ మాట్రిమోనీ సైట్‌లలో ప్రొఫెల్ పెట్టి అందరినీ మోసం చేస్తున్న కేటుగాడు ఆటను పోలీసులు కట్టించారు. అతడి బారిన పడి పెద్ద సంఖ్యలో అమ్మాయుల తల్లిదండ్రులు మోసపోయారు. దాదాపు రూ.అర కోటి వరకు మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు భండారం బయటపెట్టింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also Read: Love Fraud: లవ్ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'
హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి తండ్రి వచ్చి తమను పెళ్లి పేరిట మోసం చేశాడని ఫిర్యాదు. రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తి తనకు రూ.22 లక్షలు మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణ చౌదరి అలియాస్ వంశీకృష్ణ మోసగాడు అని తేలింది. పెళ్లి పేరిట అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేస్తూ భారీగా దండుకుంటున్నాడని గుర్తించారు. తీగ లాగితే కృష్ణ చౌదరి డొంక కదిలింది. ఇలా 50 మందికి పైగా అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Spy Camera: మహిళా టీచర్ల బాత్రూమ్‌లో రహాస్య కెమెరా.. స్కూల్ డైరెక్టర్ నీచపు పని
తనకు పెళ్లి కాలేదని చెబుతూ బట్టతల ఉన్నా కూడా విగ్గులు పెట్టుకుని వేశాలు వేస్తున్నాడు. మ్యాట్రిమోని డాట్‌కామ్‌లో అందమైన ఫొటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు చేస్తుంటాడు. ఫొటోలు అందంగా దిగి మాట్రీమోనీ సైట్‌లలో ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ.. కావాల్సిన వధువుల తల్లిదండ్రులకు వల వేస్తాడు. పేర్లు కూడా మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లిరావడం విశేషం.
తాజాగా ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ మోసం చేశాడు. డాక్టర్ తండ్రి నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేశాడు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పెడుతానంటూ ఆమె తండ్రికి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులు తాళలేక యువతి తండ్రి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి వేషాలకు ముకుతాడు పడింది. విగ్గులు ధరిస్తూ.. ఫొటోలు మారుస్తూ.. పేర్లు మారుస్తూ ఇలా మోసాలకు పాల్పడ్డుతున్న వంశీకృష్ణ అలియాస్ రాయపాటి కృష్ణ చౌదరి లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.