World Emoji Day 2022: ఈమోజీల గురించి అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికీ..సోషల్ మీడియా యూజర్లు అందరికీ సుపరిచితమైన పేరు. ఈమోజీలకు కూడా ఓ రోజుంది తెలుసా...
ఇటీవలి కాలంలో ఈమోజీల వినియోగం బాగా విస్తృతమైంది. సోషల్ మీడియా యూజర్లు, స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికీ ఈమోజీల గురించి పరిజ్ఞానం ఉంటుంది. ఏ మెస్సేజ్ పంపించాలన్నా...లేదా ఏదైనా మెస్సేజ్‌కు రియాక్షన్ ఇవ్వాలన్నా...ఈమోజీ లేకుండా ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో ఈమోజీలో సమాధానంగా పంపించే పరిస్థితి. అంతగా నిజ జీవితంలో భాగమైన ఈమోజీలకు కూడా ఓ రోజుందని ఎంతమందికి తెలుసు.
జూలై 17. అంటే ఇవాళే వరల్డ్ ఈమోజీ డే. ప్రపంచ ఈమోజీ దినోత్సవం నేడే. మూడ్ బాగున్నా..లేకపోయినా ఇతరులకు చెప్పేందుకు పదాలకు బదులు ఈమోజీలు మీ భావాల్ని అవతలి వ్యక్తికి చెబుతుంటాయి. అంతగా ప్రాచుర్యం పొందాయి కాబట్టే ప్రతియేటా జూలై 17వ తేదీన ప్రపంచ ఈమోజీ దినోత్సవం జరుపుకుంటుంటారు. జూలై 17 న ఈమోజీ దినోత్సవరం ఎందుకు జరుపుతున్నారు, చారిత్రక నేపధ్యమేంటనేది తెలుసుకుందాం..
జూలై 17న వరల్డ్ ఈమోజీ డే. సాధారణంగా ఏదైనా ప్రత్యేక దినోత్సవాన్ని ఆ సందర్భం ప్రారంభం సందర్భంగా ఆ రోజున జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈమోజీ విషయంలో అదేం లేదు. వాస్తవానికి మనం ఏదైనా మెస్సేజ్ పంపించినప్పుుడు ఆ మెస్సేజ్ అవతలి వ్యక్తికి చేరిందా లేదా అనేది తెలుసుకునేందుకు ఒక సౌండ్ అవసరమైంది. ఆ సౌండ్ ఆధారంగా మెస్సేజ్ చేరిందా లేదా అనేది తెలిసేది. క్రమంగా మెస్సేజ్ లేకుండానే ఈమోజీలు పంపించే అలవాటు ప్రారంభమైంది. అలా క్రమంగా అది విస్తృతమైంది. అందుకే జూలై 17న ఒక రోజు నిర్ణయించుకుని వరల్డ్ ఈమోజీ డే జరుపుతున్నారు.
ఈమోజీల ప్రాచుర్యం, విస్తృతి పెరగడంతో 2014 జూలై 17 నుంచి ఈమోజీ డే జరపడం ప్రారంభించారు. 2013లో ఈమోజీని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ప్రవేశపెట్టారు. 2015లో ఈమోజీని వరల్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.