Zomato Boy Humanity: అర్ధరాత్రి బోరున వర్షం కురుస్తోంది.. అయినా తప్పదు.. 12 కి.మీ దూరంలో ఉన్న ఓ లొకేషన్లో ఫుడ్ డెలివరీ చేయాలి. విజయన్ వర్షంలోనే బయలుదేరాడు. ఎట్టకేలకు ఆ ఇంటికి రీచ్ అయి ఫుడ్ డెలివరీ చేశాడు. అంతటితో అతని డ్యూటీ అయిపోయింది. కానీ అతను అక్కడితో వెనుదిరగలేదు. ఆ ఇంట్లో పాపకు జ్వరంగా ఉందని తెలిసి.. అదే హోరు వర్షంలో మరో 10 కి.మీ ప్రయాణించి ఆ చిన్నారి కోసం మందులు తీసుకొచ్చాడు. విజయన్ చేసిన ఈ మంచి పనిని జొమాటో గుర్తించింది. అతన్ని గ్యాలంట్రీ అవార్డుతో సత్కరించింది.
కేరళలోని కొచ్చికి చెందిన జితిన్ విజయన్ జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అర్ధరాత్రి ఫుడ్ డెలివరీ ఆర్డర్ రావడంతో.. వర్షంలోనే ఆ లొకేషన్‌కి వెళ్లాడు. అతను ఆర్డర్ డెలివరీ చేయాల్సిన ఇంటికి వెళ్లగా.. అక్కడో మహిళ ఏడాది వయసున్న చిన్నారితో కనిపించింది. అప్పటికే ఆ చిన్నారి జ్వరంతో బాధపడుతోంది. ఆ అర్ధరాత్రి, అంత వర్షంలో ఆ మహిళ బయటకు వెళ్లి మందులు తీసుకురావడం అసాధ్యం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న డెలివరీ బాయ్ విజయన్.. ఫుడ్ డెలివరీ చేసిన వెంటనే.. అదే వర్షంలో చిన్నారి మందుల కోసం వెళ్లాడు. మరో 10 కి.మీ ప్రయాణించి ఎట్టకేలకు చిన్నారికి మందులు తీసుకొచ్చాడు.
విజయన్ తనకెందుకులే అని భావించకుండా మానవత్వంతో అతను వ్యవహరించిన తీరు జొమాటో యాజమాన్యానికి నచ్చింది. అతను చేసిన మంచి పనిని అభినందిస్తూ ఇటీవల జొమాటో 14వ వార్షికోత్సవంలో అతన్ని గ్యాలంట్రీ అవార్డుతో సత్కరించింది. ఓవైపు డ్యూటీ చేస్తూనే.. మరోవైపు కష్టాల్లో ఉన్నవారికి సాయపడిన తీరును అభినందించింది. ఈ విషయాన్ని లింక్డెన్ పోస్టులో జొమాటో వెల్లడించింది.
Also Read: Bonalu Live Updates: అంగరంగ వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు... బంగారు బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
Also Read : BADRACHALAM FLOODS LIVE: భదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ కు నిరసన సెగ.. గవర్నర్ ను నిలదీసిన వరద బాధితులు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.