Holi 2023: హోలీ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు.

Holi 2023: దేశం మెుత్తం హోలీ చేసుకోవడానికి రెడీ అయింది. హోలీ రోజున కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల మీ ఇంటికి డబ్బు రాక పెరుగుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 10:06 AM IST
Holi 2023: హోలీ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొస్తే.. ఏడాదంతా మీకు డబ్బే డబ్బు.

Holi 2023 Remedies: మరో మూడు రోజుల్లో అంటే మార్చి 08న రంగుల హోలీ రాబోతుంది. దీనికి ఒక రోజు ముందు అంటే మార్చి 07న హోలికా దహనం జరుపుకోనున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, హోలీ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకువస్తే.. మీరు సంవత్సరం పొడవునా అపారమైన డబ్బును పొందుతారు. అంతేకాకుండా అదృష్టం కూడా వరిస్తుంది. హోలీ పండుగ రోజు ఏయే వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం. 

వెదురు ఫ్లాంట్: వెదురు మొక్కను ఇంటికి తీసుకువస్తే... అది మీకు అదృష్టాన్ని, పురోగతిని మరియు డబ్బును  తెస్తుంది. హోలీ రోజున 7 లేదా 11 కర్రలతో కూడిన వెదురు మొక్కను తీసుకురండి. దీని వల్ల మీ ఇంటిపై లక్ష్మీదేవి డబ్బు వర్షం కురిపిస్తుంది.  
స్వస్తిక్: సనాతన ధర్మంలో స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హోలీ రోజున ఇంటి మెయిన్ డోర్ పై స్వస్తిక చిహ్నాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఎప్పుడూ సానుకూలత ఉంటుంది.
తోరణం కట్టండి: హోలీ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి లేదా అశోక చెట్టు ఆకులను తోరణంగా కట్టండి.  ఇలా చేయడం చాలా శ్రేయస్కరం. 
మెటల్ తాబేలు: వాస్తు శాస్త్రంతో పాటు ఫెంగ్ షుయ్‌లో కూడా లోహపు తాబేలను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హోలీ నాడు లోహపు తాబేలును ఇంట్లోకి తీసుకురావడం వల్ల చాలా పాజిటివిటీ వస్తుంది. దీంతో పాటు ఇంట్లో డబ్బు రాక పెరుగుతుంది. 
పిరమిడ్: పిరమిడ్ చాలా సానుకూల శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో దేవాలయాలు, కొన్ని భవనాలు పిరమిడ్‌ల ఆకారంలో ఉండేవి. హోలీ రోజున ఇంట్లో లేదా ఆఫీసులో మెటల్ లేదా క్రిస్టల్ పిరమిడ్ తీసుకురావడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో చాలా ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది.

Also Read: Budh Ast 2023: బుధుడి అస్తమించడంతో..ఆ 7 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News