Amalaki Ekadashi 2023: ఉసిరి ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం మరియు పరిహారం తెలుసుకోండి..

Amalaki Ekadashi 2023: ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉసిరి ఏకాదశి అంటారు. ఇది ఎప్పుడు, పూజా ముహూర్తం తెలుసుకోండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 06:24 PM IST
Amalaki Ekadashi 2023: ఉసిరి ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం మరియు పరిహారం తెలుసుకోండి..

Amalaki Ekadashi 2023: హిందూమతం ప్రకారం, సంవత్సరం మెుత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే అమలకి ఏకాదశి లేదా ఉసిరి ఏకాదశి అంటారు. ఈరోజున శ్రీహరితోపాటు సకల దేవతలు ఉసిరి చెట్టులో నివశిస్తారని నమ్ముతారు. అందుకే ఉసిరి చెట్టును పూజించడం వల్ల ఆ గాడ్స్ అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ ఉసిరి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, దాని పూజముహూర్తం తెలుసుకోండి. 

అమలకి ఏకాదశి తేదీ
వేద క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తేదీ మార్చి 2 ఉదయం 6:38 గంటలకు ప్రారంభమై...  మార్చి 3న ఉదయం 9:02 గంటలకు ముగుస్తుంది. అందుకే అమలకి ఏకాదశిని మార్చి 3, 2023న ఉదయ తిథిగా జరుపుకుంటారు.

పూజ ముహూర్తం 
పంచాగం ప్రకారం, ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువు మరియు ఉసిరి చెట్టును పూజించండి. ఎందుకంటే ఉదయం నుండే సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది. అనంతరం శోభన యోగం మెుదలుకానుంది.  ఉదయం 06.44 నుండి 11.07 గంటల మధ్య శ్రీహరిని పూజించడానికి మంచి సమయం.  

అమలకి ఏకాదశి పరిహారం
1. అమలకి పూజ రోజున విష్ణువును పూజించి... శ్రీహరికి 21 పసుపు పుష్పాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
2. ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు నీళ్లు పోసి విష్ణుమూర్తిని ధ్యానించండి. ఇలా చేయడం వల్ల వృత్తి, వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
3. ఈ రోజున ఉసిరి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేసి 7 సార్లు నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. 
4. అమలకీ ఏకాదశి రోజున, ఒక ఏకాక్షి కొబ్బరికాయను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఉంచండి. అలాగే పూజానంతరం ఈ కొబ్బరికాయను డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. 

Also Read: Trigrahi yog 2023: కుంభరాశిలో అరుదైన యోగం.. ఈరాశులకు చెప్పలేనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News