Shani Dev : మరో 5 రోజుల్లో అరుదైన సంఘటన.. ఈరాశుల సుడి తిరగడం ఖాయం..

Shani Gochar 2023: శనిదేవుడి గమనంలో మార్పు ప్రజలందరిపై ఉంటుంది. మార్చి 15న శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 01:30 PM IST
Shani Dev : మరో 5 రోజుల్లో అరుదైన సంఘటన.. ఈరాశుల సుడి తిరగడం ఖాయం..

Shani Gochar 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. ఈ గ్రహం గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతాడు. మరో 5 రోజుల్లో అంటే మార్చి 15, ఉదయం 11.40 గంటలకు శనిదేవుడు శతభిషా నక్షత్రం మొదటి దశలోకి ప్రవేశించనుంది. అతడు అక్టోబరు 17 వరకు అక్కడే ఉంటాడు. శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి. రాహువు నక్షత్రంలో శని సంచారం కొందరికి శుభప్రదంగా ఉంటుంది. ఇది 6 రాశులవారికి కలిసి రానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ధనుస్సు : శని యొక్క ఈ సంచారం ధనుస్సు రాశి వారికి శుభప్రదం. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. 
తులా రాశి : శని శతభిషా నక్షత్ర ప్రవేశం తులారాశి వారికి చాలా మేలు చేస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీ ధన నష్టం కలుగుతుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
మకర రాశి: శతభిషా నక్షత్రం వ్యాపారులకు మంచి లాభాలను ఇస్తుంది. మీరు భారీగా ప్రయోజనాలను పొందుతారు.  దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. అనుకోకుండా ధనం వస్తుంది. 

మేషం : ఈ రాశివారు  కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు ఆర్థికంగా లాభపడతారు. శతభిషా నక్షత్రంలో శని సంచారం మీకు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
మిథునం: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు పెద్దగా శ్రమపడాల్సిన పని లేదు. వచ్చే ఏడు నెలలు మీరు అపారమైన డబ్బు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
సింహ రాశి : శతభిషా నక్షత్రంలో శని సంచారం వల్ల మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Also Read: Mangal Gochar 2023: మరో 3 రోజుల్లో ఊహించని ఘటన.. ప్రపంచంపై పెను ప్రభావం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News