Maha Mrityunjay Mantra: అకాల మృత్యుబాధ తొలగిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా.. ఈ మంత్రాన్ని జపించండి!!

Maha Mrityunjay Mantra Benefits: మహామృత్యుంజయ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రం లాగానే ఇది కూడా హిందూ మతంలో ఒక సుప్రసిద్ధమైన మంత్రం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 11:18 AM IST
  • హిందూ మతంలోని ఫేమస్ మంత్రాల్లో ఇది ఒకటి
  • దీనిని పఠించే విధానం గురించి తెలుసుకోండి
Maha Mrityunjay Mantra: అకాల మృత్యుబాధ తొలగిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా.. ఈ మంత్రాన్ని జపించండి!!

Maha Mrityunjay Mantra Benefits: శివుడికి (Lord Shiva) అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. ఈ రోజున పరమేశ్వరుడిని పూజిస్తే.. భక్తుల కోరికలు తీరుస్తాడని విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం, ఒక్కోరోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. వీరికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే ప్రయోజనం పొందుతారు. అలాంటి వాటిలో ఒకటి శివుని మహామృత్యుంజయ మంత్రం. దీని గురించి పురాణాల్లో చెప్పబడింది. ఈ మంత్రాన్ని (Maha Mrityunjay Mantra) క్రమం తప్పకుండా జపిస్తే.. ఆ వ్యక్తి అకాల మరణం నుండి విముక్తి పొందుతాడని నమ్మకం. ఈ మంత్ర ప్రయోజనం, జపించే విధానం గురించి ఇప్పడు తెలుసుకుందాం. 

మహామృత్యుంజయ మంత్రం
''ఓం త్ర్యంబక యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్'' !!

ఈ మంత్రాన్ని జపించే విధానం
>> ముందుగా స్నానం చేసి శివుడికి పూజ చేయాలి. అనంతరం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. 
>>   ఈ మంత్రాన్ని సోమవారం నుంచి ప్రారంభిస్తే మంచిది. మృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపిస్తారు. 
>>  ఈ మంత్రాన్ని మధ్యాహ్నం 12 గంటలకు ముందే జపించాలని గుర్తుంచుకోండి. 12 గంటల తర్వాత ఈ మంత్రాన్ని పఠిస్తే ఫలితం ఉండదని నమ్మకం.
>>  మీరు ఇంట్లో మంత్రాన్ని ప్రారంభిస్తున్నట్లయితే, ముందుగా శివలింగాన్ని పూజించండి. ఆ తర్వాత మాత్రమే మంత్రాన్ని జపించండి.  
>>  ఇంట్లో వీలుకాని పక్షంలో గుడికి వెళ్లి శివలింగాన్ని పూజించి, తిరిగి ఇంటికి వచ్చి నెయ్యి దీపం వెలిగించి మంత్ర జపం చేయండి.
>>  మహామృత్యుంజయ మంత్రాన్ని 11 రోజుల పాటు జపించండి. ఇది పూర్తయిన తర్వాత హవహన చేయండి. 

మంత్ర ప్రయోజనాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహబాధలు, రోగాలు, భూ-ఆస్తి వివాదాలు, ధన నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, వధూవరుల జాతకంలో దోషాలు లేకుండా ఉండేందుకు ఈ మంత్రాన్ని జపిస్తారు. 

Also Read: Mars Transit 2022: మిథునరాశిలో బుధ సంచారం... ఈ నాలుగు రాశులవారికి డబ్బే డబ్బు! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News