Mirror Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకుంటాం. లేదంటే ఇవి ఇంటిపై నెగిటివిటీని పెంచుతాయి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఇంటి ఈ 7 దిక్కుల్లో ఉండకూడదు. ఇంట్లో అద్దం తప్పనిసరి. అద్దం సాధారణంగా బెడ్రూం, బాత్రూం వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది అద్దాలు పెట్టుకోరు. అయితే, ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అద్దాలు ఏర్పాటు చేసుకుంటే చిన్నగా ఉన్న ప్రదేశాలు కూడా పెద్దగా కనిపిస్తాయని పెడతారు.
బెడ్ రూమ్‌లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. కానీ, పడకగదిలో అద్దం పెట్టకూడదు. వాస్తు పరంగానే కాదు ఒకవేళ భూకంపం వంటివి సంభవించినా అద్దం బెడ్‌పై పడితే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి.
ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా అద్దాన్ని పెట్టకూడదు. బయట నుంచి వచ్చే గాలి నేరుగా అద్దానికి తగలడం వల్ల అశుభం. చాలా మంది హాల్లో అద్దాలను ఏర్పాటు చేసుకుంటే స్థలం పెద్దగా కనిపిస్తుందని పెడతారు. ఎదురుగా కాకుండా డిజైన్‌గా ఓ పక్కకు ఏర్పాటు చేసుకోవచ్చు.
వేడి అధికంగా ఉండే ప్రదేశంలో కూడా అద్దాలు పెట్టకూడదు. ముఖ్యంగా సీలింగ్ వంటి ప్రదేశంలో అద్దం పెట్టినా అనర్థాలు జరగవచ్చు. మీ కంటి లెవల్లో మాత్రమే అద్దం ఉండాలి. అంతకు పైకి ఉండకూడదు.
వాస్తు ప్రకారం కిటకీకి ఎదురుగా కూడా అద్దం పెట్టకూడదు. దీనివల్ల బయట నుంచి వచ్చే సహజసిద్ధమైన గాలి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. గాలి, వెలుతురు ఇంట్లోకి రాకుండా కూడా అద్దాన్ని పెట్టకూడదు.
స్నానం చేసే గది అద్దం కూడా ఎదురెదురు పెట్టకూడదు. ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రైవసీ కూడా ఉండదు. టాయిలెట్ వెనుక భాగంలో కూడా అద్దం పెట్టకూడదు. ఇలా చేస్తే వాస్తు విరుద్ధం కూడా. వాస్తు ప్రకారం ఇలా చేస్తే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది.
ఇదీ చదవండి: సాయిబాబా భక్తులకు శుభవార్త.. IRCTC హైదరాబాద్ - షిరిడీ, శింగనాపూర్ టూర్ ప్యాకేజీ..
ఒకవేళ మీరు డైనింగ్ రూమ్‌లో అద్దం పెడితే మీ కంటికి పైభాగం నుంచి కాస్త ఎత్తులో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే బంధువులు ఎవరైనా డైనింగ్ హాల్లో కూర్చొని తింటే వాళ్లని ఎవరైనా అద్దంలో గమనిస్తున్నారేమో అనే ఇబ్బంది పడతారు.
సీలింగ్‌పై కూడా అద్దం పెట్టకూడదు. ఇది సేఫ్టీ కాదు. ఇది ప్రైవసీగా ఉండదు కూడా. ఇంటీరియర్ డిజైన్‌లో భాగంగా కూడా దీన్ని పెట్టకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం చిత్ర పటం ఎందుకు కచ్చితంగా పెట్టుకోవాలి? పండితుల సూచనలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి