Astrology: మీ జాతకంలో ఆ రెండు గ్రహాల కలయిక ఉంటే..ఇక సుఖభోగాలు, సంపదే సంపద

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఏదైనా జాతకం కుండలిలో రాహువు, శుక్రగ్రహాల సమ్మేళనం ఓ అద్భుత ప్రయోజనానికి సంకేతమట. సుఖ సంతోషాలు, సంపదతో ఆ జాతకులు వర్ధిల్లుతారట. ఆ వివరాలు పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2022, 11:07 AM IST
 Astrology: మీ జాతకంలో ఆ రెండు గ్రహాల కలయిక ఉంటే..ఇక సుఖభోగాలు, సంపదే సంపద

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఏదైనా జాతకం కుండలిలో రాహువు, శుక్రగ్రహాల సమ్మేళనం ఓ అద్భుత ప్రయోజనానికి సంకేతమట. సుఖ సంతోషాలు, సంపదతో ఆ జాతకులు వర్ధిల్లుతారట. ఆ వివరాలు పరిశీలిద్దాం..

జ్యోతిష్యం నమ్మేవారికి ఇదొక గుడ్‌న్యూస్. మీ కుండలిలో రాహువు, శుక్ర గ్రహాల కలయిక ఉందో లేదో చూసుకోండి. ఉంటే ఇక మీకు తిరుగే లేదు. ఆ రెండు కలిసుంటే ఆ జాతకంపై అద్భుతమైన ప్రభావం పడుతుందట. ఈ రెండు లాభాలకు కారణం. ఈ రెండింటి మధ్య గురు శిష్యుల సంబంధముంది. శుక్రుడంటే..దేవతల గురువు శుక్రాచార్యుడు, రాహువు అతనికి శిష్యుడు. ఈ రెండు గ్రహాలు లగ్జరీతో ఉంటాయి అంటే రెండింటి కలయిక కారణంగా ఆ వ్యక్తికి సుఖభోగాలు ప్రాప్తిస్తాయి. జీవితంలో ఆర్ధిక ఇబ్బందులుండవు. సంపదతో వర్ధిల్లుతాడు.

శుక్రుడి రాకతో ఆనందపడే రాహువు

కుండలిలో రాహువు, శుక్రుడు కలవగానే రెండూ ఆనందపడతాయట. ఎందుకంటే రెండూ స్వభావరీత్యా ఒకే పోలికలు కలిగుంటాయి. సుఖభోగాలు రెండింటికీ ఇష్టం. రెండింటి స్వభావంలో భోగవిలాసాలు అధికం. అంటే తినడం, తాగడం, మస్తీ చేయడం అలవాటు. జీవితంలో భోగవిలాసాలు, సుఖ సంతోషాలు అన్నీ శుక్రుడి ఆధీనంలో ఉంటాయి. గురుశిష్యులు కావడంతో ఈ రెండింటి మధ్య మంచి బంధమేర్పడుతుంది. రెండింటి ప్రాధాన్యతల జాబితాలో సుఖం ఉంటుంది. ఈ రెండింటికి సుఖభోగాలు ఇష్టమున్నట్టే..సంబంధిత వ్యక్తి జాతకంలో ఈ రెండు గ్రహాలు మంచి స్థితిలో ఉంటే అవే సుఖభోగాలు ఆ వ్యక్తికీ ప్రాప్తిస్తాయి. రాహువు సంపదనిస్తాడు. వాస్తవానికి రాహువుకు కూడా లోలోపల భోగమంటే చాలా ఆశ ఉంటుంది. ఒకవేళ ఎవరి జాతకంలోనైనా రాహువు క్రియాశీలకంగా ఉంటే..ఆ వ్యక్తికి దేనికీ వెనుకాడడని అర్ధం.

రాహువు, శుక్ర గ్రహాల కలయిక విలాసవంతమైన జీవితాన్ని అందిస్తుంది. అయితే ఈ జాతకుల దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం జరిగితే..అది మంచిది కాదు. భార్య ఆరోగ్య విషయమై సమస్యలు తలెత్తుతాయి. భార్యకు యూరిన్ ఇన్‌ఫెక్షన్, డయాబెటిస్ వంటి రోగాలు రావచ్చు. ఎందుకంటే రాహువుని విషదేవతగా అభివర్ణిస్తారు. అటు పురుషులకు కూడా ఇవే సమస్యలు రావచ్చు.

ఉపాయాలు-పూజలు

రాహు, శుక్ర గ్రహాల కలయిక పూర్తి లాభాలు పొందాలంటే జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలున్నాయి. జీవితంలో సంయమనం ఉండాలి. లేకపోతే సమస్త రోగాలు అంటుకుంటాయి. వాస్తవానికి రెండు గ్రహాలు మీ ఆదాయ మార్గాల్నించి ఎక్కువ సంపద వచ్చేలా చేస్తాయి. లెక్కలేనంతగా సంపద కురిపిస్తాయి. అంటే నెంబర్ టూ ఆదాయాన్ని అందిస్తాయి. ఈ రెండు గ్రహాల కలయిక జాతకమున్న వ్యక్తులు కష్టపడకుండానే డబ్బులు సంపాదిస్తారు. ఇటువంటి వ్యక్తులు దేవి ఉపాసన చేయాల్సి ఉంటుంది. దుర్గామాత పూజలు చేయాలి. శుక్ర, రాహువుల కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలు దూరమౌతాయి. ఇలాంటి వ్యక్తులు లగ్జరీ జీవితం పట్ల నిగ్రహం పాటించాలి. 

Also read: Tuesday Remedies: పేదరికం, అప్పుల నుండి బయటపడాలంటే.. మంగళవారం ఈ పనులు చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News