Monthly Horoscope for August 2023: ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోంది..ఏ పనులు చేసినా లాభాలే లాభాలు!

Monthly Horoscope for August 2023: ఆగస్టు నెలలో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రాశుల వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయని వారి చెబుతున్నారు మరికొన్ని రాశుల వారు ఊహించని లాభాలు కూడా పొందబోతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయో రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 1, 2023, 09:16 AM IST
Monthly Horoscope for August 2023: ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవ్వబోతోంది..ఏ పనులు చేసినా లాభాలే లాభాలు!

Monthly Horoscope for August 2023: ఆంగ్ల క్యాలెండర్లో ఆగస్టు నెలలో 8వ నెలగా భావిస్తారు. అయితే ఈ ఆగస్టు నెల రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నెలలో హిందువులకు అత్యంత ప్రాముఖ్యమైన శ్రావణమాసం కూడా ప్రారంభం కాబోతోంది. అధికమాసం కారణంగా ఆగస్టు నెల మొత్తం శ్రావణమాసంతో నిండి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇదే నెలలో హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఇక గ్రహాల విషయానికొస్తే ఆగస్టు నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాసి సంచారం చేయబోతున్నారు. దీని కారణంగా చాలా రాశుల వారి జీవితాలపై ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెలలో ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారికి జూలై నెల కంటే ఆగస్టు నెల కొంత ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో మీరు అనుకున్న పనులు సులభంగా జరగాలంటే తప్పకుండా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ నెలలో కొంత ఆందోళన చెందుతారు. వీరు ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరగడం కారణంగా ఒత్తిడి కూడా మొదలవుతుంది. ఒక ఉద్యోగాలు చేసేవారు పని పట్ల నిర్లక్ష్యం చేయడం మానుకోవడం చాలా మంచిది. ఇక ఆగస్టు రెండోవారం విషయానికొస్తే.. ఆకస్మిక వచ్చే సమస్యల కారణంగా కొంత డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది లేకపోతే అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  

వృషభ రాశి:
వృషభ రాశి వారు ఆగస్టు నెలలో పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసికంగా అనారోగ్య సమస్యల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిబంధనలు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో నీకు ఇష్టమైన వారు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడడం వల్ల మీరు ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. సీజన్ మారడం కారణంగా అంటు వ్యాధులు ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే క్రమంలో తప్పకుండా ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆగస్టు నెల రెండవ వారం విషయానికొస్తే.. ఈ రెండో వారం వీరికి కొన్ని రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఎప్పటినుంచో కోర్టు కేసులలో తిరుగుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మిధున రాశి:
ఆగస్టు నెలలో మిధున రాశి వారు ఓర్పు సహనంతో ఉండడం వల్ల ఈ పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వృత్తిపరంగా సామాజిక పరంగా మిధున రాశి వారు ఆచితూచి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే.. భవిష్యత్తులో ఊహించని ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ నెలలో ఈ రాశి వారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక ఈ నెలలో నెరవేరబోతోంది. క్రమంలో విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తే భారీ లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల కారణంగా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో మీకు మీ స్నేహితుల మద్దతు లభించి కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. సంతానలేని సమస్యలతో బాధపడుతున్న వారికి కోరికలు నెరవేరబోతున్నాయి. ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే కాకుండా కోరుకున్న కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News