Pushya Masam: తెలంగాణలో కొత్త పండుగ.. వదిన మరదళ్లు ఇవి ఇచ్చిపుచ్చుకోవాలంట..

Bangles Festival: కుటుంబ అనుబంధాలను పెంచే మరో పండుగ వచ్చింది. పుష్యమాసంలో వదిన మరదళ్లు తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నెలలో గాజుల పండుగ వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న పండుగ ఇప్పుడు తెలంగాణలోనూ చేసుకుంటున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 03:23 PM IST
Pushya Masam: తెలంగాణలో కొత్త పండుగ.. వదిన మరదళ్లు ఇవి ఇచ్చిపుచ్చుకోవాలంట..

New Tradition In Telangana: తెలంగాణలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. గ్రామీణ తెలంగాణలో ఈ సంప్రదాయాలు అధికంగా పాటిస్తారు. ఇన్నాళ్లు బావబామ్మర్దులు, అత్తా కోడళ్లు, ఆడబిడ్డల బరువు పేరుతో పండుగలు వచ్చేవి. ఇప్పుడు అదే క్రమంలో మరో బరువు పండుగ వచ్చింది. ఈసారి వదిన మరదళ్ల పండుగ వచ్చిదంట. ఈ సందర్భంగా వదిన మరదళ్లు ఓ వస్తువును ఇచ్చుపుచ్చుకోవాలని ప్రచారం జరుగుతోంది.

Also Read: Oye Re Release: 'ఓయ్‌' రీ రిలీజ్‌ క్రేజ్‌.. థియేటర్‌లో యువతి డ్యాన్స్‌ అదుర్స్‌ వావ్ వావ్

ఈ బరువు పండుగల వార్తలు తెలంగాణలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి. నెలల వ్యవధిలో ఒక్కో బరువు వస్తోంది. తాజాగా వచ్చిన బరువు వదిన మరదళ్లపైన అంట. ప్రస్తుతం వదిన మరదళ్ల మీద బరువు వచ్చిదంట. ప్రస్తుతం పుష్యమాసం రావడంతో గాజుల పండుగ మొదలవుతుంది. ఈ మాసంలో పెళ్లయిన మరదలిని పుట్టింటికి పిలిచి గాజులు తొడగడం ఆచారం. అనంతరం మరదలను వదినను ఆశీర్వదించడం ఆనాదిగా వస్తోంది. కొన్ని కుటుంబ విషయాలు, కాపురానికి సంబంధించిన విషయాలను పంచుకోవడం చేస్తుంటారు.

Also Read: Zomato Cocroach: జొమాటో ఆర్డర్‌లో చచ్చిన బొద్దింక.. పార్సిల్‌ ఓపెన్‌ చేయగానే బెంబేలెత్తిన కస్టమర్‌

ఈ గాజుల పండుగ వెనుక ఎంతో పరమార్థం దాగి ఉంది. కుటుంబసభ్యుల మధ్య వచ్చిన పొరపొచ్చలు, విబేధాలు తొలగడానికి గాజుల పండుగ ఒక పరోపకారంగా దోహదం చేస్తుంది. కొన్నాళ్ల నుంచి ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఈ పండుగ ద్వారా తొలగిపోతాయని నమ్మకం. పెళ్లి నాటి నుంచి కుటుంబంలో వచ్చ అపార్థాలు తొలగడానికి గాజుల పండుగ ఉపయోగపడుతుంది. వాస్తవంగా గాజుల పండుగ మహారాష్ట్రలో చేసుకుంటారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న తెలంగాణలోని నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఈ సంప్రదాయం మొదలైంది. 

పుష్యమాసంతో మొదలయ్యే పండుగ నెల రోజులు ఉంటుంది. కొందరు నెల దాటిన తర్వాత కూడా చేసుకుంటారు. ఈ గాజుల పండుగ అప్పుడు సుమారు రూ.వెయ్యి దాకా ఖర్చు చేసి గాజులు ఇస్తారు. మరికొందరు చీర, బహుమతులు పెట్టి మర్యాద చేసుకుంటారు. ఇలా వదినకు మరదలు కూడా చేయవచ్చు. ఇలాంటి సంప్రదాయం కుటుంబ అనుబంధాలను పెంచుతుంది. మీ ఇంట్లో కూడా వదిన మరదళ్లు ఉంటే ఇలా గాజులు వేసుకోండి. మీ మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News