Budhaditya Raj Yog: వృశ్చికరాశిలో 'బుధాదిత్య రాజయోగం' .. ఈ 3 రాశులకు ఆర్థికంగా లాభం..

Budhaditya Raj Yog: వైదిక జ్యోతిష్యం ప్రకారం వృశ్చికరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 12:34 PM IST
Budhaditya Raj Yog: వృశ్చికరాశిలో 'బుధాదిత్య రాజయోగం' .. ఈ 3 రాశులకు ఆర్థికంగా లాభం..

Budhaditya Raj Yog In Kundli: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈనెలలో మూడు ప్రధాన గ్రహాలైన బుధుడు, శుక్రుడు, సూర్యుడు ఒకేరాశిలో ప్రవేశించనున్నాయి. నవంబరు 13న గ్రహాల యువరాజు బుధుడు, నవంబర్ 16న సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ రాశుల కలయిక వల్ల అరుదైన బుదాదిత్య యోగం(Budhaditya Raj Yog) ఏర్పడుతోంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశులకు ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

సింహం (Leo): మీ జాతకం యెుక్క ఐదో ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 

కన్య (Virgo): బుధాదిత్య రాజయోగంగా కారణంగా ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి మూడవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవిని పొందే అవకాశం ఉంది. కుటుంబంలో  సంతోషం నెలకొంటుంది. మీకు సోదర, సోదరీమణుల సపోర్టు లభిస్తుంది. 

కుంభం (Aquarius): బుధాదిత్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి పదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీరు వ్యాపారంలో మంచి డబ్బు సంపాదిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. ఆఫీసులో మీ సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. 

Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U    

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News