Budh Varki 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం..రాబోయే 15 రోజులు ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

Budh Varki 2022: అంతరిక్షంలో గ్రహాల స్థానంలో చిన్న మార్పు కూడా ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న బుధుడు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపనున్నాడో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 04:55 PM IST
Budh Varki 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం..రాబోయే 15 రోజులు ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

Budh Varki 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా గ్రహం యెుక్క కదలికలో మార్పు అన్ని రాశులవారిని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం బుధుడు కన్యారాశిలో తిరోగమనంలో (Budh Varki 2022) ఉన్నాడు. అక్టోబర్ 2, 2022 వరకు బుధుడు అదే స్థితిలో ఉంటాడు. బుద్ధి,తెలివితేటలు, కమ్యూనికేషన్, సంపదకు కారకుడిగా బుధుడిని భావిస్తారు. బుధుడి స్థానంలో చిన్న మార్పు కూడా మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కన్యారాశిలో బుధుడి  తిరోగమనం కొన్ని రాశులవారికి లాభదాయకంగా, మరికొన్ని రాశులవారికి అశుభకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో చూద్దాం. 

వృషభం (Taurus) - ఈ రాశివారికి ఈ సమయంలో భారీగా ధనం లభిస్తుంది. వీరి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్టు ఎల్లప్పడూ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. 
మిథునం (Gemini) - ఈ సమయంలో ఈ రాశివారు కొంత ఒత్తిడికి గురికావచ్చు. పనిలో సడన్ గా సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. 
కర్కాటకం (Cancer) - ఆఫీసులో అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కరినే అతిగా నమ్మడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఈ సమయంలో కోపాన్ని వీడండి. అది అంత మంచిది కాదు. 
వృశ్చికం (Scorpio)- చిక్కుకున్న డబ్బు తిరిగి పొందుతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
కుంభం (Aquarius)- ఈ సమయంలో మీకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపారంలో నష్టాలు రావచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవద్దు. 

Also Read: Budhaditya Yog 2022: కన్యారాశిలో బుధాదిత్య యోగం... ఈ రాశులవారికి జాక్ పాట్ ఖాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News