Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రి (Chaitra Navratri 2023)కి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ నవరాత్రులు హిందూ క్యాలెండర్ ప్రకారం.. మార్చి 22 ప్రారంభమై మార్చి 30న ముగుస్తాయి. ఈ నవరాత్రి మొదటి రోజున దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల మొదటి రోజు అనగా చైత్ర ప్రతిపాదంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నవరాత్రుల మొదటి రోజున ఈ పరిహారాలు చేయండి:
నవరాత్రుల మొదటి రోజున దుర్గ మాతకు తమలపాకులో చేసిన నైవేద్యం తయారు చేసిన పెడితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుగ్రహం లభించి చాలా అనుకున్న కోరికలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే జీవితంలో పలు రకాల సమస్యలతో బాధపడేవారు నవరాత్రిలో ఈ పరిహారం పాటిస్తే సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి.
మొదటి రోజున అమ్మవారి పాదాల వద్ద శ్రీయంత్రాన్ని ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రం తప్పకుండా బంగారం లేదా వెండితో తయారు చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాల్సి ఉంటుంది:
నవరాత్రుల్లో దుర్గదేవికి సంబంధించిన చాలా రకాల మంత్రాలున్నాయి. అయితే చైత్ర నవరాత్రి (Chaitra Navratri 2023) ముందు జపించే 'ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచే' మంత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. నవరాత్రులలో ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి.
హనుమంతుని పూజకార్యక్రమాలు తప్పకుండా పాటించాలి:
నవరాత్రులలో హనుమంతుని ఆరాధించడం వల్ల అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నవరాత్రి సమయంలో సుందరకాండను పఠించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా రామ రక్షా స్తోత్రం పటించాల్సి ఉంటుంది.
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook