Chandra Grahan 2022: భారత్‌లో ఈ ప్రాంతాల్లోనే చంద్ర గ్రహణం కనిపిస్తుందా.. నేరుగా చూడడం వల్ల జరిగే దుష్ప్రభావాలు ఇవేనా..?

Chandra Grahan 2022 In Hyderabad Date And Time: భారత దేశంలో పలు ప్రాంతాల్లో చంద్ర గ్రహణం పాక్షికంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏయే రాష్ట్రాల్లో ఏ సమయాల్లో ఏర్పడనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా  2022 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 10:29 AM IST
Chandra Grahan 2022: భారత్‌లో ఈ ప్రాంతాల్లోనే చంద్ర గ్రహణం కనిపిస్తుందా.. నేరుగా చూడడం వల్ల జరిగే దుష్ప్రభావాలు ఇవేనా..?

Chandra Grahan Time 2022 In India: ఈ రోజూ 2022 సంవత్సరం చివరి చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. అయితే  భారత్‌తో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించనుంది. చంద్రగ్రహణం శాస్త్రీయంగా అద్భుతమైన ఖగోళ సంఘటనగా శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే గ్రహణం వల్ల జాగ్రత్తలు పాటించకపోతే  అశుభకరమైన సంఘటనలు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చంద్రగ్రహణం ఏ రాష్ట్రాల్లో ఏయే సమయాల్లో ఏర్పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం..

భారతదేశంలో చంద్రగ్రహణం ఏ సమయంలో ప్రారంభమవుతుంది, అది ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలుసా..?:
భారతదేశంలో ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 08న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 06.20 గంటలకు ముగుస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలిపారు. దీని సూతక కాలం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే అన్ని మంచి జరుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తప్పకుండా ఈ క్రమంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రావడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాల్లో చంద్రగ్రహణం సమయాలు:
>>సాయంత్రం 5:07 నుంచి 6:18 వరకు రాంచీలో ఏర్పడుతుంది.
>>పాట్నాలో సాయంత్రం 5:05 నుంచి 6:18 వరకు..
>>సాయంత్రం 5:32 నుంచి 6:18 వరకు న్యూఢిల్లీలో కనిపించనుంది.
>>కోల్‌కతాలో సాయంత్రం 4:56 నుంచి 6:18 వరకు..
>>ముంబై: సాయంత్రం 6:05 నుంచి 6:18 వరకు
>>రాయ్పూర్: సాయంత్రం 5:25 నుంచి 6:18 వరకు
>>భువనేశ్వర్: సాయంత్రం 5:10 నుంచి 6:18 వరకు
>>జైపూర్: సాయంత్రం 5:41 నుంచి 6:18 వరకు
>>జోధ్‌పూర్: సాయంత్రం 5:53 నుంచి 6:18 వరకు
>>ఇటానగర్: సాయంత్రం 4:28 నుంచి 6:18 వరకు
>>గౌహతి: సాయంత్రం 4:37 నుంచి 6:18 వరకు
>>విశాఖపట్నం: సాయంత్రం 5:24 నుంచి 6:18 వరకు
>>గ్యాంగ్‌టక్: సాయంత్రం 4:48 నుంచి 6:18 వరకు
>>ప్రయాగరాజ్: సాయంత్రం 5:18 నుంచి 6:18 వరకు
>>కాన్పూర్: సాయంత్రం 5:23 నుంచి 6:18 వరకు
>>హరిద్వార్: సాయంత్రం 5:26 నుంచి 6:18 వరకు
>>ధర్మశాల: సాయంత్రం 5:30 నుంచి 6:18 వరకు
>>చండీగఢ్: సాయంత్రం 5:31 నుంచి 6:18 వరకు
>>నాగ్‌పూర్: సాయంత్రం 5:36 నుంచి 6:18 వరకు
>>భోపాల్: సాయంత్రం 5:40 నుంచి 6:18 వరకు
>>చెన్నై: సాయంత్రం 5:42 నుంచి 6:18 వరకు
>>హైదరాబాద్: సాయంత్రం 5:44 నుంచి 6:18 వరకు
>>బెంగళూరు: సాయంత్రం 5.53 నుంచి 6:18 వరకు
>>నాసిక్: సాయంత్రం 5:55 నుంచి 6:18 వరకు
>>అహ్మదాబాద్: సాయంత్రం 6:00 నుంచి 6:18 వరకు
>>సూరత్ : సాయంత్రం 6:02 నుంచి 6:18 వరకు
>>జామ్‌నగర్: సాయంత్రం 6:11 నుంచి 6:18 వరకు
>>ఉజ్జయిని: సాయంత్రం 5:47 నుంచి 6:18 వరకు
>>పూణే : సాయంత్రం 6:01 నుండచి 6:18 వరకు
>>తిరువనంతపురం: సాయంత్రం 6:02 నుంచి 6:18 వరకు
>>పనాజీ: సాయంత్రం 6:06 నుంచి 6:18 వరకు
>>జమ్మూ: సాయంత్రం 5:35 నుంచి 6:18 వరకు

Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్

Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News