Vaishakh Purnima 2023: 130 ఏళ్ల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం.. శుభ సమయం తెలుసుకోండి..

Vaishakh Purnima 2023: వచ్చే నెలలో వైశాఖ పూర్ణిమ రాబోతుంది. ఈరోజున 130 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్ఛికం ఏర్పడబోతుంది. వైశాఖ పూర్ణిమ ఎప్పుడు, స్నాన దానానికి శుభ సమయం తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2023, 12:28 PM IST
Vaishakh Purnima 2023: 130 ఏళ్ల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం.. శుభ సమయం తెలుసుకోండి..

Vaishakh Purnima 2023 date: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి రోజున వైశాఖ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు స్నాన దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అంతేకాకుండా ఇదే రోజున 130  ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్చికం ఏర్పడబోతుంది. ఈ పవిత్రమైన రోజున మెుదటి చంద్రగ్రహణం కూడా సంభవించబోతుంది. మరోవైపు ఇదే రోజు బుద్ధ జయంతి కూడా జరుపుకోనున్నారు. 

వైశాఖ పూర్ణిమ శుభ సమయం 
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి మే 04 రాత్రి 11:34 గంటలకు ప్రారంభమై... తర్వాత రోజు రాత్రి 11:03 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున చంద్రుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. 
స్నాన దాన ముహూర్తం
చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున సంభవిస్తుంది, అయితే దాని సూత కాలం భారతదేశంలో చెల్లదు. అలాంటి సమయంలో  వైశాఖ పూర్ణిమ నాడు సూర్యదోయ సమయంలో స్నానం చేసి దానం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండి గ్రహణానికి ముందు చంద్రుడిని పూజించండి. ఈ రోజున చంద్రోదయం సాయంత్రం 05:58 గంటలకు ఉంటుంది. ఈ రోజు సాయంత్రం చంద్రునికి అర్ఘ్య నైవేద్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. 

 Also Read: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ 2 రాశులకు మంచిది కాదు.. ఇందులో మీరున్నారా?

తొలి చంద్రగ్రహణం ఎప్పుడు?
2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5న రాత్రి 08:45 నుండి 01:00 గంటల వరకు జరగబోతుంది. ఈ గ్రహణం మొత్తం 4 గంటల 15 నిమిషాల పాటు మాత్రమే ఏర్పడనుంది. ఇదే సమయంలో 130 సంవత్సరాల తర్వాత బుద్ధ పూర్ణిమ లేదా వైశాఖ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవించడం యాదృచ్ఛికంగా ఉంది.
భద్ర ముహూర్తం
వైశాఖ పూర్ణిమ రోజున భద్ర సమయం ఉంటుంది. ఈ రోజున భద్ర ముహూర్తం సాయంత్రం 05.01 గంటలకు ప్రారంభమై రాత్రి 11.27 వరకు ఉంటుంది.

Also Read: Planet Transits May 2023: వచ్చే నెలలో 4 గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 5 రాశులకు ఆకస్మిక ధనలాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News