Kedarnath Temple Closed: మూతపడిన కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు, తిరిగి తెర్చుకునేది ఎప్పుడు

Kedarnath Temple Closed: ఉత్తరాదిన మంచు ప్రారంభమైంది. శీతాకాలపు గాలులు వీస్తున్నాయి. హిమగిరుల్లో వెలసిన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మరోసారి మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెర్చుకుంటాయంటే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2021, 08:01 AM IST
  • మూతపడిన కేదార్‌నాథ్ , యమునోత్రి ఆలయాలు
  • ప్రతియేటా శీతాకాలంలో మంచు కారణంగా మూతపడే ఆలయాలు
  • ఇప్పటికే మూతపడిన గంగోత్రి ఆలయం, ఈనెల 20న మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం
Kedarnath Temple Closed: మూతపడిన కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు, తిరిగి తెర్చుకునేది ఎప్పుడు

Kedarnath Temple Closed: ఉత్తరాదిన మంచు ప్రారంభమైంది. శీతాకాలపు గాలులు వీస్తున్నాయి. హిమగిరుల్లో వెలసిన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మరోసారి మూతపడ్డాయి. తిరిగి ఎప్పుడు తెర్చుకుంటాయంటే.

హిమాలయాల్లో ఉన్న సుప్రసిద్ధ దేవాలయాలు కేదార్‌నాథ్(Kedarnath Temple), యమునోత్రి ఆలయాలపై శీతాకాలం మంచు ప్రభావం పడింది. ఉత్తరాదిన శీతాకాలపు గాలులు ప్రారంభం కావడం, మంచు కారణంగా ప్రతియేటా బద్రీనాధ్, గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మూతపడుతుంటాయి. హిమాలయాల్లో భారీగా మంచుపడే శీతాకాలంలో ఈ ఆలయాల్ని మూసివేయడం ప్రతియేటా జరుగుతోంది. తిరిగి వేసవి ప్రారంభంలో ఈ ఆలయాలు తెర్చుకుంటాయి. హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్ , యమునోత్రి ఆలయాలు(Kedarnath and Yamonotri temples Closed) నవంబర్ 6న మూతపడ్డాయి. సంప్రదాయపద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాల్ని శనివారం ఉదయం 8 గంటలకు, మద్యాహ్నం 12 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాల్ని మూసివేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. శీతాకాల బస నిమిత్తం ఈ దేవాలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాల్ని అందంగా అలంకరించిన పల్లికిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంగోత్రి ఆలయం ఇప్పటికే అంటే శుక్రవారం మూతపడగా..ఈ నెల 20వ తేదీన బద్రీనాథ్ ఆలయం(Badrinath Temple) మూతపడనుంది. మంచు తగ్గుముఖం పట్టిన తరువాతే తిరిగి ఈ ఆలయాలు తెర్చుకోనున్నాయి.

Also read: Diwali 2021 celebrations in india: భారత్‌లో దీపావళి వేడుకలు ఫోటోలు గ్యాలరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News