Devshayani Ekadashi 2022: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశినే దేవశయని ఏకాదశి అంటారు. ఇది ఈ సంవత్సరం జూలై 10న వస్తుంది. ఈ రోజు నుంచి శ్రీహరి నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళ్తాడు. అంతేకాకుండా దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi 2022) నుంచే చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు. దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ.. విష్ణువును పూజిస్తారు. దేవశయని ఏకాదశి వ్రతం పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూజా విధానం
దేవశయని ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఉపవాసం పాటిస్తూ.. విష్ణువు యెుక్క శయన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేయడం ప్రారంభించాలి. ఈ రోజున పార్వతీ దేవిని కూడా పూజిస్తుంటారు. వ్రతం చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించండి. అంతేకాకుండా శ్రీహరికి పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షతలు, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతాన్ని సమర్పించండి. పూజా చేసేటప్పుడు 'ఓం భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వ్రత కథను చదివి హారతితో పూజను ముగించండి.
ఉపవాస సమయంలో పండ్లను మాత్రమే తీసుకోండి. రాత్రిపూట ఆహారం తీసుకోవద్దు. తర్వాత రోజు ఉదయం తులసి పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి. మీరు ఏకాదశి రోజు రాత్రిపూట జాగరం చేసే సమయంలో లేదా తర్వాత రోజు ఉదయం స్నానం చేసి బ్రహ్మణుడికి ఆహారం, వస్త్రాలు, దక్షిణ దానం చేయండి.
Also Read: Ashadh Purnima 2022: ఆషాఢ పూర్ణిమ రోజున స్నానం, దానం చేయండి... అంతులేని సంపదను సొంతం చేసుకోండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతం ఇలా చేస్తే... ఇంటి నిండా ఐశ్వర్యమే!
మరో రెండు రోజుల్లో దేవశయని ఏకాదశి
ఆ రోజు నుంచే చాతుర్మసం ప్రారంభం
శ్రీహరిని ఇలా పూజించండి