Rahu Mercury Conjunction: మీన రాశిలోకి ఇటీవలే అనేక పెద్ద గ్రహాలు రాశి సంచారం చేశాయి. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు కూడా మీన రాశిలో సంచార దశలో ఉంది. అలాగే బుధుడు కూడా ఈ బుధవారం సంచారం చేశాడు. దీని కారణంగా మేష రాశిలో రెండు గ్రహాల కలయిక జరిగింది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాహువు, బుధుల కలయిక జరిగింది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలపుతున్నారు. ఈ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడితే, మరికొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
వృశ్చిక రాశి:
మీనరాశిలో జరిగిన గ్రహాల కలయిక కారణంగా వృశ్చిక రాశివారికి అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎప్పటి నుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అప్పులు తీసుకున్నవారు కూడా తిరిగి చెల్లిస్తారు.
మకరరాశి:
ఈ రెండు గ్రహాల కలయికల కారణంగా మకర రాశివారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ రాశివారికి బుధుడి అనుగ్రహం లభించి ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరు కొత్త అవకాశాలు కూడా పొందుతారు. దీంతో పాటు వీరు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శుభప్రదం.
కర్కాటక రాశి:
మీనరాశిలో జరిగే ఈ గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారికి కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెడుతున్నవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్నవారికి చిన్న చిన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశాల ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి