Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!

Rahu Nakshatra Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 18, 2024, 09:23 AM IST
Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!

Rahu Nakshatra Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే ఈ గ్రహం చాలా అరుదుగా రాశి సంచారం చేస్తుంది. కానీ ఇది ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒక సారి తిరోగమనం చేస్తుంది. జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే పేద వ్యక్తులు కూడా సులభంగా ధనవంతులవుతారు. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే ధనికులు నిరుపేదవారవుతారు. ఇదిలా ఉండగా రాహువు గ్రహం గత సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేసింది. వచ్చే సంవత్సరం మే నెల వరకు ఈ గ్రహం అదే రాశిలో సంచారం దశలోనే కొనసాగుతుంది. అయితే ఈ రాహువు గ్రహం త్వరలోనే ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది.     

జూలై 8న రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయడం వల్ల 3 రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఈ రాశులవారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించడమే కాకుండా ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. అయితే రాహువు నక్షత్ర సంచారం కారణంగా ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

వృషభ రాశి:
రాహువు నక్షత్ర సంచారం చేయడం కారణంగా వృషభ రాశివారికి విపరీమతైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న పెండింగ్‌ పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు ఈ సమయంలో ఊహించని శుభ వార్తలు కూడా వింటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు కూడా తొందరగా నెరవేరుతాయి. 

తులారాశి:
తులా రాశివారికి రాహువు సంచారం కారణంగా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితుల సపోర్ట్‌ లభించి ఈ సమయంలో వీరు అనే ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. అలాగే విదేశాల్లో కూడా వ్యపారాలు చేసేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభించే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

వృశ్చిక రాశి:
రాహు సంచార ప్రభావం వృశ్చిక రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా వీరికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఇంతముందు అసంపూర్తిగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌ ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. ఈ సమచారాన్ని జీ తెలుగు న్యూస్‌ ఆమోదించదు.)

Also Read: Nayanthara: ఆటో డ్రైవర్, డెలివరీ అబ్బాయితో గొడవపడి.. ఇల్లు ఖాళీ చేసిన నయనతార..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News