Zodiac Signs: ఈ రాశులవారు డిసెంబర్‌లో భూములతో పాటు భవనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు..

Shukra Gochar Effect on Shani Sade Sati Zodiac Signs: శుక్రుడి సంచారం, శని సాడేసతి కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2023, 02:03 PM IST
Zodiac Signs: ఈ రాశులవారు డిసెంబర్‌లో భూములతో పాటు భవనాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు..

Shukra Gochar Effect on Shani Sade Sati Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా రాశులవారి వ్యక్తి జీవితాల్లో మార్పులు జరగుతాయి. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు సంచారం చేయడం వల్ల వ్యక్తిగత జీవితాల్లో లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయి.  శుక్రుడు అతి తర్వలోనే కన్యారాశి నుంచి  తులారాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని రాశులవారిపై శని సాడేసతి ప్రభావం కూడా పడబోతోంది. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో ఉండడం వల్ల మీన, మకర, కుంభ రాశుల వారిపై ఈ సమయంలో ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడి ప్రభావం ఏయే రాశులవారిపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మకర రాశి:
మకరరాశికి శుక్రుడు ఐదవ స్థానం, పదవ స్థానానికి అధిపతిగా వ్యవహరించబోతున్నాడు. దీని కారణంగా మకర రాశివారికి ఉహించని లాభాలతో పాటు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు వృత్తి జీవితం గడుపుతున్నవారికి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కెరీర్‌కు సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ రాశివారు భూములతో పాటు భవనాలు, వాహనాలు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. 

కుంభ రాశి:
శుక్రుడి సంచారం కారణంగా కుంభ రాశికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో సంచారం జరగబోతోంది. దీని కారణంగా కుటుంబ జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అంతేకాకుండా అనేక రకాల శుభ కార్యాలు జరుపుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉండడం కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చులు పెరుగుతాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

మీన రాశి:
మీనరాశి వారికి ఈ సంచారం 3,    8వ స్థానాల్లో జరబోతోంది. దీంతో పాటు ఈ రాశివారికి 8వ స్థానానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. దీని కారణంగా మీన రాశివారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మద్ధతు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీ అత్తమామలతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బులను కూడా ఆదా చేయాల్సి ఉంటుంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News