Falgun Purnima 2023: హిందూమతంలో ఫాల్గుణ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి దేవుడిని ఆరాధిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. దీనితో పాటు హోలికా దహన్ పండుగ మరియు లక్ష్మీ జయంతి కూడా ఈ రోజునే జరుపుకోనున్నారు. ఫాల్గుణ పూర్ణిమ వ్రతాన్ని ఆచరించి శ్రీహరిని ఆరాధిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఫాల్గుణ పూర్ణిమ తేదీ, పూజ ముహూర్తం గురించి తెులుసుకోండి.
ఫాల్గుణ పూర్ణిమ 2023 తేదీ
వైదిక క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ మార్చి 06న సాయంత్రం 04:16 గంటలకు ప్రారంభమై మార్చి 07న సాయంత్రం 06:08 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఫాల్గుణ పూర్ణిమ స్నానం మరియు దానం మార్చి 07న ఉంటుంది.
స్నాన-దాన ముహూర్తం
ముందుగా ఉదయం 05:01 నుండి 05:52 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. దీనితో పాటు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.08 నుండి 12.55 వరకు ప్రారంభమవుతుంది. మరోవైపు మధ్యాహ్నం 02.29 నుంచి మధ్యాహ్నం 03.16 వరకు విజయ్ ముహూర్తం మెుదలవుతుంది. ఈ ముహూర్తాల్లో దానం, స్నానం చేయవచ్చు. ఫాల్గుణ పూర్ణిమ నాడు మార్చి 07వ తేదీ సాయంత్రం 06.18 గంటలకు చంద్రోదయం, మార్చి 08వ తేదీ ఉదయం 06.45 గంటలకు చంద్రోదయం అవుతుంది.
ఈ చర్యలు చేయండి
1- శాస్త్రాల ప్రకారం, లక్ష్మిదేవి ఈ రోజునే అవతరించింది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున ఆ తల్లిని పూజించడం వల్ల సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది.
2- ఫాల్గుణ పౌర్ణమి రాత్రి చంద్రుడిని పూజించండి, ఎందుకంటే పౌర్ణమి నాడు చంద్రుడు తన పదహారు కళలతో ఆకాశంలో ఉదయిస్తాడు. అందుకే చంద్రుడిని పూజించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. దీనితో పాటు మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.
Also read: Trigrahi Yog: మూడు దశాబ్దాల తర్వాత కుంభంలో త్రిగ్రాహి యోగం.. ఈరాశులపై కనక వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.