Fengshui Tips: ఇంట్లో ఫెంగ్ షుయ్ క్యాట్ ను ఈ దిశలో ఉంచితే... ఇక మీకు తిరుగుండదు!

Fengshui Tips: ఇంట్లో ఫెంగ్ షుయ్ క్యాట్ ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఏ రంగు ఫెంగ్ షుయ్ పిల్లిని ఉంచడం వల్ల ఏయే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2022, 11:02 AM IST
Fengshui Tips: ఇంట్లో ఫెంగ్ షుయ్ క్యాట్ ను ఈ దిశలో ఉంచితే... ఇక మీకు తిరుగుండదు!

Feng Shui Lucky Cat: చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్ లో డబ్బు, ఆనందం, శ్రేయస్సుకు సంబంధించి అనేక చిట్కాలు చెప్పబడ్డాయి. ఇంట్లో ఫెంగ్ షుయ్ వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీ ఉండటంతోపాటు మీకు లక్ కూడా కలిసి వస్తుంది.  ఇంట్లో ఫెంగ్ షుయ్ క్యాట్ (Feng Shui Lucky Cat) ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫెంగ్ షుయ్ క్యాట్ కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

ఫెంగ్ షుయ్ క్యాట్ ప్రయోజనాలు
ఫెంగ్ షుయ్ పిల్లిని అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఫెంగ్ షుయ్ క్యాట్ ను ఉంచడం వల్ల రాబోయే సంక్షోభాన్ని అరికట్టవచ్చు. ఫెంగ్ షుయ్ పిల్లి యెుక్క ఒక చేయి నిరంతరం కదులుతూ ఉంటే దానిని డబ్బు పిల్లి అంటారు. ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడేవారు తమ ఇంట్లో లేదా షాపులో బంగారు రంగులో ఉండే ఫెంగ్ షుయ్ పిల్లిని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఫెంగ్ షుయ్ పిల్లిని ఈ దిశలో ఉంచండి..
అదృష్టం కోసం ఆకుపచ్చ ఫెంగ్ షుయ్ పిల్లిని ఇంట్లో ఉంచాలి. దీనిని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. ఈ దిశలో ఫెంగ్ షుయ్ పిల్లిని ఉంచడం ప్రయోజనకరంగా భావిస్తారు. మీ ప్రేమ జీవితం బాగుండాలంటే.. ఎర్ర పిల్లిని ఇంట్లో పెట్టుకోండి. ఈ పిల్లిని ఇంటికి నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరం. ఇంట్లో శ్రేయస్సు మరియు డబ్బు నిలవడానికి నీలం పిల్లిని కలిగి ఉండటం శ్రేయస్కరం. ఈ పిల్లిని కుబేరుని ఆగ్నేయ దిశలో ఉంచాలి.

Also Read: Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News