Visha Yogam: అత్యంత కీడు యోగమైన విష యోగం ఏర్పాటు.. ఈ రాశుల వారికి జరగబోయేది 100% ఇదే..

Vish Yoga 2024: జూలై 23వ తేదీన కీడు యోగంగా భావించే  విష యోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా వెనకబడే ఛాన్స్ ఉంది

Written by - Shashi Maheshwarapu | Last Updated : Jul 24, 2024, 09:28 PM IST
 Visha Yogam: అత్యంత కీడు యోగమైన విష యోగం ఏర్పాటు.. ఈ రాశుల వారికి జరగబోయేది 100% ఇదే..

Vish Yoga 2024: ఏ రాశి అయినా ఒక గ్రహం మరో గ్రహం తప్పకుండా సంచారం చేస్తూ ఉంటుంది. దీనిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారంగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని కీడు గ్రహాలు సంచారం చేయడానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అలాగే కొన్ని కీడు గ్రహాలు సంచారం చేయడానికి ఏడాది నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శని ఉన్న కుంభరాశిలో జూలై 23న అశుభకారమైన  విష యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్ త్రం ఇలాంటి యోగా లు నెలకు ఒకటి నుంచి రెండు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అశుభకరమైన యోగం ఏర్పడడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక దుష్ప్రభావాల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఏయే రాశుల వారు ఈ సమయంలో జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారు..

కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారిపై ఈ అశుభ యోగ ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరికి అనేక అనారోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో తప్పకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కొన్ని మంచి లాభాలు పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అనేక అశుభవార్తలు వింటారు. దీని కారణంగా మానసిక స్థితి కోల్పోయే అవకాశాలున్నాయి. భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు వాదనలకు దూరంగా ఉండటం వల్ల స్వామీదం ఆనందంగా ఉంటారు. వ్యాపారాలు చేసేవారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. 

కన్యా రాశి: 
కన్యా రాశి వారికి జాతకంలో ఆరవ స్థానంలో ఈ అశుభయోగం ఏర్పడింది. దీనికి కారణంగా వీరికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలతో పాటు శత్రువుల పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఉద్యోగాలు చేసే అధికారుల నుంచి సపోర్టు లభించగా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీంతోపాటు వీరు అపరిచితుల వలె ప్రవర్తిస్తారు. అలాగే ఏదైనా పనులు చేసే గ్రామాల్లో తప్పకుండా పదిసార్లు ఆలోచించి చేయడం వల్ల సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు భాగస్వా మ్యం వాదనలకు దూరంగా ఉండడం ఎంతో మేలు.. 

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశి వారికి ఆ శుభ యోగం కారణంగా అనేక సమస్యల బారిన పడాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా శత్రువుల నుంచి కూడా అనేక అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే భాగస్వామితో ఉన్నప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే వాదోపవాదాలతో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆశుభయోగం కారణంగా ఆర్థికంగా కూడా వృశ్చిక రాశి వారు ఎంతగానో వెనకబడి పోతారు.

మీన రాశి:
ఈ సమయంలో మీన రాశి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు వచ్చే ఛాన్సులున్నాయి దీంతోపాటు పెట్టుబడులు పెట్టడం మానుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రుణాలు తీసుకునే క్రమంలో కూడా పలుసార్లు ఆలోచించాల్సింది. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News