Four Mahayog after 100 Years: 100 ఏళ్ల తర్వాత మీనంలో 4 రాజయోగాలు.. ఈ 5 రాశులకు వద్దన్నా డబ్బు, అదృష్టం

Gajkesri Neechbhang Budhaditya and Hans Rajyog in Pisces: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 100 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో 4 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వల్ల ఐదు రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2023, 10:54 AM IST
Four Mahayog after 100 Years: 100 ఏళ్ల తర్వాత మీనంలో 4 రాజయోగాలు.. ఈ 5 రాశులకు వద్దన్నా డబ్బు, అదృష్టం

Gajkesri Neechbhang Budhaditya and Hans Rajyog after 100 Years: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. సుమారు 100 సంవత్సరాల తరువాత మీన రాశిలో 4 మహా యోగాలు ఏర్పడబోతున్నాయి. అవే గజకేసరి, నీచభంగ్, బుధాదిత్య మరియు హన్స్ రాజయోగం. ఈ యోగాలు కారణంగా ఐదు రాశులవారు ఆకస్మిక ధనలాభం మరియు వృత్తి-వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

వృషభ రాశి

నాలుగు మహా యోగాలు వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి లాభ స్థానంలో ఇవి ఏర్పడుతున్నాయి. దీంతో మీకు అనుకోకుండా ధనం అందుతుంది.  మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. 

కుంభ రాశి

నాలుగు రాజయోగాలు ఏర్పడటం వల్ల కుంభ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే ఈ 4 రాజయోగాలు మీ సంచార జాతకంలో అదృష్ట స్థానంలో ఏర్పడబోతున్నాయి. దీంతో మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ మెుదలవుతాయి. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

మిథున రాశిచక్రం

మీ యెుక్క కర్మ స్థానంలో గజకేసరి, నీచభంగ్, బుధాదిత్య మరియు హన్స్ రాజయోగాలు రూపొందుతున్నాయి. దీని కారణంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్ బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. 

కన్య రాశిచక్రం

నాలుగు మహా యోగాలు ఏర్పడటం వల్ల కన్యారాశికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి. ఎందుకంటే ఈ 4 రాజయోగాలు మీ రాశి నుండి ఏడవ ఇంటిలో ఏర్పడుతున్నాయి. దీంతో మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మంచి లాభాలు పొందుతారు. లవ్ లైవ్ బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.

ధనుస్సు రాశిచక్రం

గజకేసరి, నీచభంగ్, బుధాదిత్య మరియు హన్స్ రాజయోగాల ఏర్పాటు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంటిపై ఈ యోగం ఏర్పడుతోంది.. దీంతో మీరు ఏదైనా భూమి-ఆస్తి కొనుగోలు చేయవచ్చు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది,. కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. పాలిటిక్స్ లో ఉన్నవారిని విజయలక్ష్మీ వరిస్తుంది. 

Also Read: Hindu New Year 2023: 30 ఏళ్ల తర్వాత ఉగాది రోజున అరుదైన యాదృచ్చికం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News