Gajlakshmi Rajyog 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత ప్రభావం పెరుగుతుంది. దీని ప్రభావం 12 రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే అన్ని గ్రహాల్లా కాకుండా బృహస్పతి గ్రహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గ్రహ సంచారానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ గ్రహం ప్రత్యేకమైన మేష రాశిలో సంచారం చేయడం వల్ల ఓ ప్రత్యేక శుభ యోగం ఏర్పుడుతుంది. ఈ ఏర్పడే యోగాన్ని గజలక్ష్మి రాజయోగం అంటారు. ఏప్రిల్ 27 బృహస్పతి మేషరాశిలో సంచారం చేశాడు. దీంతో గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
12 ఏళ్ల తర్వాత తొలిసారిగా గురువు బృహస్పతి వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారిపై గజలక్ష్మి రాజయోగం ప్రభావం:
మిథునరాశి:
మిథునరాశి వారికి గజలక్ష్మీ యోగం వల్ల చాలా రాశులవారితో ఈ రాశివారికి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
కన్య రాశి:
కన్యారాశి వారికి గజలక్ష్మీ రాజయోగం అదృష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సమాజంలో గౌరవం పెరగడమేకాకుండా మంచి పేరు కూడా సంపాదిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో మంచి లాభాలు కలుగుతాయి.
తులారాశి:
తుల రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి మెరుగుపడుతుంది.
మీనరాశి:
గజలక్ష్మీ రాజ్యయోగం వల్ల ఈ రాశి వారికి విపరీతమైన సంపద లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతం పెరిగే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి ఈ క్రమంలో మంచి లాభాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook