Temples of India: భారతదేశం ధార్మికతకు పెట్టింది పేరు. ఆలయాలు మన సంస్కృతికి చిహ్నాలుగా.. మన పూర్వీకుల పేరు ప్రఖ్యాతలకు గుర్తులుగా ఉన్నాయి. అలాంటి ఆలయాలలో కొన్ని కఠినమైన నియమ నిబంధనలను పాటిస్తాయి. అయితే మహిళలకు ప్రవేశం లేని ఆలయాల గురించి మనం విని ఉంటాం.. కానీ ప్రవేశం లేని దేవాలయాలు ఉన్నాయి అని మీకు తెలుసా. అసలు పురుషులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కాపలాదారులను కూడా నియమించే ఆలయాలు ఉన్నాయి అంటే నమ్మసక్యంగా ఉందా? అయితే అటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం..
రాజస్థాన్.. విభిన్నమైన సంస్కృతికి.. విచిత్రమైన వాతావరణంలో.. పలు రకాల హస్తకళలకు ప్రాముఖ్యత పొందిన రాజస్థాన్లో దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పుష్కర్ దేవాలయంలోకి పురుషుల ప్రవేశం నిషిద్ధం. పుష్కర్ దేవాలయం బ్రహ్మదేవుని యొక్క ఆలయం. ఇది 14వ శతాబ్దానికి చెందిన గుడి. అయితే ఈ గుడిలోకి వివాహమైన పురుషులకు ప్రవేశం లేదు. స్థల పురాణం ప్రకారం.. బ్రహ్మదేవుడు పుష్కర సరస్సు దగ్గర యజ్ఞం చేయడానికి పూనుకుంటాడు.. అయితే అక్కడికి సరస్వతి దేవి ఆలస్యంగా వస్తుంది.
యజ్ఞం చేయాలి అంటే భార్య ఉండాలి కదా.. అందుకని బ్రహ్మదేవుడు గాయత్రి వివాహమా ఆ క్రతువును పూర్తి చేశారట. ఈ విషయం తెలిసి ఆగ్రహానికి గురి అయిన సరస్వతి దేవి.. ఆ యజ్ఞం జరిగిన పరిసర ప్రాంతాలలో పురుషులకు స్థానం ఉండదని.. పొరపాటున ఎవరైనా అక్కడికి ప్రవేశిస్తే వారి వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవని శాపం ఇచ్చింది. ఆనాడు యాగం జరిగిన ప్రదేశంలోని బ్రహ్మదేవుడి గుడి వెలసింది. అందుకే అక్కడికి వివాహం జరిగిన పురుషులకు అస్సలు ప్రవేశం లేదు. కొందరు వివాహం కాని పురుషులు వెళ్లడానికి జంపుతారు కూడా.
అలాగే అస్సాం..గువాహటిలోని నీలాచల్ పర్వతంపైన.. వెలసిన కామరూప కామాఖ్య ఆలయం ఉంది. ఇది ఒక దేవత గుడి కాదు.. అనేక ఉపాలయాల సమాహారమే ఈ గుడి. ఈ గుడిలో కాళికాదేవి, తారా దేవి, భువనేశ్వరి దేవి, భైరవి దేవి ,చిన్నమస్త దేవి ,దూమవతి దేవి, భగలాముఖి దేవి ,మాతంగి దేవి.. ఇలా ఎందరో దేవతల ఆలయాలు ఉన్నాయి. దక్షయజ్ఞంలో జరిగిన అవమానం తట్టుకోలేక యజ్ఞవాటికలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుంది సతీదేవి. ఇక ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని ఉగ్రరూపంలో తాండవం చేస్తుంటారు శివుడు.
శివుడి తాండవం సృష్టి వినాశనానికి దారితీస్తుంది అని భావించిన మహావిష్ణువు తన చక్రాన్ని ప్రయోగించి అమ్మవారి దేహాన్ని ఖండాలుగా విభజిస్తారు. అలా ఆమె యోని భాగం పడిన ప్రదేశాన్ని నేటి కామాఖ్యా దేవాలయం గా గుర్తింపు పొందింది. మిగిలిన రోజుల్లో ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించవచ్చు.. కానీ నెలలో ఆ మూడు రోజులు మాత్రం ఆలయంలో పురుషులకు అస్సలు ప్రవేశం ఉండదు. అష్టాదశ శక్తి పీఠాలలో ఈ దేవాలయం కూడా ఒక శక్తి పీఠంగా పూజలు అందుకుంటుంది.
Also Read: Rasi Phalalu: డిసెంబర్ చివరి వార ఫలాలు..ఈ వీక్ పై చేయి ఈ రాశుల వారిదే..
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి