August Grah Gochar: ఆగష్టులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల జీవితంలో పెను మార్పులు..

Grah Gochar in August 2023: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ కదలికలను మారుస్తాయి. ఆగస్టులో సూర్యుడు, శుక్రుడు మరియు అంగారకుడు తమ రాశులను మార్చబోతున్నాయి. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 06:21 AM IST
August Grah Gochar: ఆగష్టులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల జీవితంలో పెను మార్పులు..

Planet Transit In August 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయాల్లో తమ స్థానాలను మార్చుకుంటాయి. ఆగష్టు నెలలో కొన్ని పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. సూర్యుడు, శుక్రుడు మరియు అంగారకుడు తమ రాశులను మార్చనున్నారు. గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే నెలలో ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

సూర్య సంచారం: సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఆదిత్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఆగస్టు 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు సంచారం వల్ల మేషం, సింహం మొదలైన రాశుల వారికి ఈ సమయం బాగుంటుంది. 
శుక్ర సంచారం: లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆగస్ట్ 7, ఉదయం 10.37 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది కన్యా, తుల, వృషభ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వనుంది. 

Also Read: Sawan Shivratri 2023: శ్రావణ శివరాత్రి నాడు ఈ రాశులను వరించనున్న అదృష్టం.. మీది ఉందా?

అంగారక సంచారం: గ్రహాల కమాండర్ అయిన మార్స్ కూడా ఆగస్టులో తన స్థానాన్ని మార్చుకోబోతోంది. ఆగస్టు 17న కుజుడు తన రాశిని మార్చుకుని కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడిని ధైర్యం, పరాక్రమం, భూమి-సంపదలకు కారకుడిగా భావిస్తారు. అంగారకుడి రాశి మార్పు వల్ల మేషం మరియు కన్య రాశులవారికి మేలు జరగబోతుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Guru Vakri 2023: సెప్టెంబర్ నెలలో గురుడు తిరోగమనం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News