Conjunction of Planets on Durga Ashtami 2023: చైత్ర నవరాత్రులు మార్చి 22 నుండి ప్రారంభమై.. మార్చి 30 వరకు కొనసాగుతాయి. మార్చి 29, బుధవారం నాడు అష్టమి తిథి వస్తుంది. ఇదే రోజు మహా అష్టమి యొక్క హవన-కన్యా పూజ చేస్తారు. దీంతో పాటు ఈ శుభదినాన కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది.
మహా అష్టమి నాడు గ్రహాల మహా సంయోగం
30 ఏళ్ల తర్వాత చైత్ర నవరాత్రులలో గ్రహాల మహా సంయోగం జరుగుతోంది. మహాష్టమి నాడు శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి దాని స్వంత రాశి అయిన మీనంలో ఉంటుంది. దీని వల్ల మహా అష్టమి నాడు కేదార్, హన్స్, మాలవ్య, మహాభాగ్య వంటి రాజయోగాల గొప్ప కలయిక ఏర్పడుతోంది. మహా అష్టమి నాడు 4 రాజయోగాలు కలిసి ఏర్పడటం కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది.
మహా సంయోగం ఈ రాశులకు వరం
మిథునం: చైత్ర నవరాత్రుల అష్టమి మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లికాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది.
కర్కాటకం: ఈ మహా అష్టమి కర్కాటక రాశి వారికి ఎంతో గౌరవాన్ని, పదవిని, ధనాన్ని ఇస్తుంది. కొత్త ఉద్యోగం పొందుతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్-ఇంక్రిమెంట్ ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. జీవితంలో ఆనందం నెలకొంటుంది.
కన్య: మహా అష్టమి నాడు గ్రహాల మహా సంయోగం కన్యా రాశి వారికి చాలా పురోభివృద్ధిని ఇస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.
మీనం: ఈ రాజయోగం మీన రాశి వారికి భారీగా డబ్బును ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ కల నెరవేరుతుంది. పాలిటిక్స్ లో ఉన్నవారికి పదవి లభించే అవకాశం ఉంది.
Also Read: Trigrahi Yog 2023: మీన రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి