Trigrahi Yog 2023: మీనరాశిలో బృహస్పతి, సూర్యుడు & బుధుడు సంయోగం.. ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం

Trigrahi Yog 2023:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీన రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ సమయంలో మీనరాశిలో బృహస్పతి, సూర్యుడు, బుధ గ్రహాలు ఉండటం వల్ల కొందరికి అదృష్టం కలిసివస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 08:57 AM IST
Trigrahi Yog 2023: మీనరాశిలో బృహస్పతి, సూర్యుడు & బుధుడు సంయోగం.. ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ రాశులపై డబ్బు వర్షం

Surya Budh Guru yuti in Meen: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా ఇతర ఫ్లానెట్స్ తో పొత్తులు పెట్టుకుంటాయి. ఈ గ్రహాల కలయిక ప్రభావం ప్రజలందరిపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపిస్తాయి. రీసెంట్ గా బృహస్పతి రాశి అయిన మీనరాశిలో మూడు గ్రహాల కలయిక ఏర్పడింది. మీనరాశిలో బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు సంయోగం కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. బృహస్పతి అదృష్టానికి కారకుడు, సూర్యుడు విజయం మరియు బుధుడు సంపద మరియు తెలివితేటలకు కారకుడు. ఈ త్రిగ్రాహి యోగం ఏ రాశి వారికి భారీ లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం

వృశ్చికం: మీన రాశిలో చేసిన త్రిగ్రాహి యోగం వృశ్చికరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరు కెరీర్ లో గొప్ప పురోగతిని సాధిస్తారు. కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. జీతం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 

ధనుస్సు: సూర్యుడు, గురుడు, బుధుల కలయికతో ఏర్పడిన ఈ త్రిగ్రాహి యోగం ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కొత్త ఇల్లు-కారు, ఖరీదైన నగలు-బట్టలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి.

మీనం: ఈరాశిలోనే మాత్రమే త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో మీనరాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Surya Gochar 2023: వేరే రాశిలోకి ట్రావెల్ చేయనున్న సూర్యుడు.. ఇక ఈ 6 రాశులవారు పట్టిందల్లా బంగారం.. 

Also Read: Rolls Royce Cullinan Black Badge: షారుఖ్ వద్ద ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News