Guru Mahadasha 2023: మహాదశలో పెళ్లి కానీ వారు ఇలా చేస్తే, విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు!

Guru Mahadasha 2023: గ్రహాల సంచారంలో మంచి మార్పులు ఉంటే మహాదశలు ఏర్పడతాయి. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 09:18 AM IST
 Guru Mahadasha 2023: మహాదశలో పెళ్లి కానీ వారు ఇలా చేస్తే, విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు!

Guru Mahadasha 2023: సంవత్సరంలో గ్రహాల మహాదశ ప్రతి వ్యక్తి జాతకంలో ఒకసారి వస్తుంది. అయితే ఇది జీవితంపై రెండు రకాల ప్రభావాలను చూపుతుంది. ఈ వారం పలు రాశులవారి జీవితంలో గురు మహాదశ ఏర్పడబోతోంది. ఇది బృహస్పతి కనుసంధానంలో జరుగుతుంది. అయితే ఈ మహాదశ 16 సంవత్సరాలు ఉండే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ దశ వల్ల పలు రాశులవారి జీవితంలో మంచి ప్రయోజనాలు జరగబోతున్నాయని, మరి కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గురు మహాదశ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి:
>>మీ జాతకంలో బృహస్పతి బలహీన స్థితిలో ఉంటాడు. అయితే ఈ క్రమంలో గురువు ఉపవాసాలు పాటిస్తే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
>>స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా ప్రతి రోజూ చేస్తే దురదృష్టం తొలగియి..శుభం కలుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
>>వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా గురువారం ఉపవాసం ఉండాలి. దీంతో వివాహబంధంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాకుండా మంచి భాగస్వామి లభిస్తుంది.
>>గురువారం రోజు దాన, ధర్మ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పసుపు రంగుతో కూడిన వస్తువులను దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జాతకంలో గురుగ్రహ స్థానం బలపడుతుంది.
>>ఇతరలతో మాట్లాడే క్రమంలో ఎలాంటి అబద్ధపు మాటలను చెప్పకూడదు. అంతేకాకుండా ఇతరుల పట్ల నిజాయితిగా ఉండాల్సి ఉంటుంది.

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్.. 

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News