Hariyali Teej Fasting Rules 2022: భర్త దీర్ఘాయుష్షు కోసం మరియు సంతోకరమైన వైవాహిక జీవితం కోసం మహిళలు హరియాలీ తీజ్ వ్రతాన్ని చేస్తారు. ఈ ఏడాది హరియాలీ తీజ్ వ్రతం (Hariyali Teej vrat 2022) జూలై 31న వస్తుంది. ఈ వ్రతం చాలా కష్టమైనది. చుక్క నీరు కుడా తాగకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి లేదా గర్భిణీ స్త్రీలకు ఈ ఉపవాసం నుండి మినహాయింపు ఉంటుంది. ఈ ఉపవాస సమయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. లేకపోతే వ్రతం యెుక్క పూర్తి ఫలాన్ని పొందలేరు.
హరియాలీ తీజ్ ఉపవాస నియమాలు:
1. ఈ వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో.. అప్పటి నుండి పారణ వరకు నీరు కూడా ముట్టకోకూడదు.
2. హరియాలీ తీజ్ ఉపవాసంలో ఆకుపచ్చ రంగు ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అఖండ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ ఉపవాసంలో మహిళలు ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ చీరలు మరియు ఇతర అలంకరణ వస్తువులలో ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఉపయోగిస్తారు.
3. ఈ వ్రతంలో పార్వతి దేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఆమెకు 16 అలంకరణ వస్తువులను సమర్పిస్తారు. ఇందులో మెహదీ, మహావర్, కుంకుమ్, సిందూర్, బ్యాంగిల్, చునారి, చీర, ఆభరణాలు, పూల దండ మొదలైనవి ఉన్నాయి.
4. హరియాలీ తీజ్ పూజ అయిపోయిన తర్వాత మీ అత్తగారికి మరియు కోడలికి ప్రసాదాన్ని అందించండి. వారి ఆశీస్సులు తీసుకోండి.
5. మీరు మీ భర్త కోసం ఈ ఉపవాసం ఉన్నట్లయితే.. ఆ రోజున పొరపాటున కూడాభర్తతో వాదించకండి.
6. ఉపవాసం చేసేటప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు పార్వతీమాతను ప్రార్థించి..పాస్టింగ్ ను విరమించండి. మాత సంతోషించి మీకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
7. కొన్ని కారణాల వల్ల ఈ పండుగను చేయలేని మహిళలు హరియాళీ తీజ్ వ్రత కథ చదవాలి లేదా వినాలి. దీని ద్వారా మీరు పార్వతీమాత ఆశీస్సులు కూడా పొందుతారు.
8. ఈ వ్రతం చేసేటప్పుడు పార్వతీమాతతోపాటు గణేశుడిని, శివుడిని కూడా పూజించండి. మీకు శుభం జరుగుతుంది.
Also Read: Sravanam 2022: శ్రావణ స్కంద షష్ఠి వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook