Horoscope March 3 2022: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారట!

Horoscope March 3 2022: ఈ రోజు కొన్ని రాశులవారికి కలిసి వస్తోంది. మరికొన్ని రాశులకు మిశ్రమకాలం నడుస్తోంది. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 06:28 AM IST
  • మేషరాశివారికి ఆర్థికంగా శుభఫలితాలు
  • తులరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి
  • మీనరాశివారు ఓ శుభవార్త వింటారు
Horoscope March 3 2022: నేటి రాశిఫలాలు... ఈ రాశివారు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తారట!

Horoscope March 3 2022: సాధారణంగా మనం ఏదైనా పని ప్రారంభించాలన్నా, శుభకార్యం చేయాలన్న ఆ రోజు దినఫలాలు చూస్తాం. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

మేషం (Aries) :  ఈ రోజు ఈ రాశివారికి ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  

వృషభం (Taurus) : ఈ రాశివారికి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. 

 మిథునం (Gemini) : ఈ రోజు ఈ రాశివారు చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. వీరు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయకండి.

కర్కాటకం (Cancer):  వీరు ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు తలెత్తకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేస్తే మంచిది.

సింహం (Leo) :  ఈ రోజు ఈరాశివారికి శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మెుదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ కలహాలు పెట్టుకోరాదు. 

కన్య (Virgo):  వీరు విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా లాభపడతారు. మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. 

తుల (Libra): పనులకు ఇబ్బందులు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వీరికి ఖర్చులు పెరుగుతాయి. 

వృశ్చికం (Scorpio) : ఈ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటే మంచిది. టైంకి నిద్రాహారాలు తప్పనిసరి. 

ధనుస్సు ((Sagittarius): ఈ రోజు ఈరాశివారు మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఎవరినీ ఎక్కువగా నమ్మద్దు. మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి. 

మకరం (Capricorn) : ఈ రాశివారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు శుభఫలితాలను ఇస్తాయి. 

కుంభం (Aquarius) : ఈ రోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేస్తారు. వీరికి కీలక విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కీలక లావాదేవీలు నిపుణులను సంప్రదించి చేస్తే మంచిది.

మీనం (Pisces) :  వీరికి ఒక శుభవార్త మీ మనో ధైర్యాన్ని పెంచుతుంది. మీ పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. గోసేవ చేస్తే మంచిది.

Also Read: Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News