Today Horoscope In Telugu 09 May 2021: నేటి రాశి ఫలాలు మే 09, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 09 May 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2021, 09:18 AM IST
Today Horoscope In Telugu 09 May 2021: నేటి రాశి ఫలాలు మే 09, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 09 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 09వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
కొందరు తమ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రేమగా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని గ్రహించనట్లుగా ఉంటూనే వారి ప్రయత్నాలను తిప్పికొడతారు. ఆత్మవిశ్వాసం మీ బలం. చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం ఏర్పడుతుంది. కొన్ని విషయాలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తాయి. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. నగదు, ఆస్తి విషయంలో సమస్యలు ఎదురవుతాయి.

Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

వృషభ రాశి
మీరు నమ్మే విషయాల గురించి ఇతరులతో చర్చిస్తారు. కానీ వారు మీరు చెప్పే విషయాలపై విశ్వాసం ఉంచరు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటాయి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు వస్తాయి. 

మిథున రాశి
కొన్ని విషయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. ఉత్సాహభరితమైన వాతావరణంలోనే మీకు ప్రయోజనాలు కలుగుతాయని తెలుసుకోండి. మిథున రాశి వారు నేడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉంటుంది. చాలా రోజుల తరువాత మీ చేతికి డబ్బు అందుతుంది.

కర్కాటక రాశి 
బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం మీ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఊహించని ఘటనలు జరగడంతో మీ తీరు పూర్తిగా మారుతుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులు నూతన ప్రాజెక్టులు అందుకుంటారు.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

సింహ రాశి
ఈ రోజు మీరు పనిచేసే చోట గుర్తించే సమస్యలను అంతగా పట్టించుకోరు. చాలా కాలం కిందటే మీరు వాటిని గుర్తించారు. మీ ప్రస్తుత పరిస్థితి గమనించి ఇతరులతో మాట్లాడటం శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. సన్నిహితులు, స్నేహితులతో జాగ్రత్తగా నడుచుకోకపోతే సమస్యలు తప్పవు.  

కన్య రాశి
గత కొంతకాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇకనుంచి మీరు కేవలం పనులపై ఫోకస్ చేస్తారు. నేడు మీకు విలువైన మరియు ముఖ్యమైన రోజు కానుంది. కొన్ని సమావేశాలు, సభలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందుతాయి. ప్రస్తుతం ఇది మీకు శ్రేయస్కరం కాదు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

తులా రాశి
ఈ రోజు మీరు వినూత్న ప్రయోగాలు చేయడానికి సిద్దపడతారు. మీ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి ఇది తగిన సమయమని భావిస్తారు. అవకాశాలు వచ్చినా, ఆత్మగౌరవం అడ్డొచ్చి వాటిని వదులుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చిక రాశి
మీరు ఎంత ధనవంతులు మరియు సమర్థులైనప్పటికీ అణుకువగా మెలగడం చాలా అవసరం. డబ్బు ఉందన్న పొగరు, గర్వం తలపైకి ఎక్కుంచుకుంటే అనర్థాలు తప్పవు. మీ సాయం కోరి వచ్చిన వారికి తోడ్పాటు అందిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

ధనుస్సు రాశి
ఆదాయం తగ్గడంతో రుణ యత్నాలు మొదలు పెడతారు. ఓ అవకాశం మీ తలుపు తట్టనుంది. టెలిఫోన్‌లో కొన్ని విలువైన విషయాలు తెలుసుకుంటారు. దాని వల్ల మీ పనిలో వేగం పెరుగుతుంది. మీ పని మరియు లక్ష్యాలపై ఉన్న ఆసక్తిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులలో నిరాశ అధికం కానుంది.

మకర రాశి
భవిష్యత్ ప్రణాళికలు ఏర్పాటు చేసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపారులకు నేడు లాభాలు గోచరిస్తున్నాయి. ఈరోజు సంతృప్తిగా ఉంటారు. కష్టపడి పనిచేసి ఇతరులపై విజయం సాధిస్తారు. కొన్ని విషయాలలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. అయితే అప్పులు మాత్రం చేయకూడదని గ్రహించండి. 

కుంభ రాశి
మీరు సాధారణంగా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. నేడు శాంతియుతంగా వ్యవహరించడానికి ఇతరులతో చర్చలు జరుపుతారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాత్రిలోగా శుభవార్త అందుకుంటారు. అనవసరమైన విషయాలపై ఖర్చులు చేయకూడదు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

మీన రాశి
నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండాలి. వారితో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని విషయాలలో కఠినంగా వ్యవహరిస్తారు. ఎవరితో చర్చించకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పని భారం తగ్గనుంది. వ్యాపారులకు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News