Today Horoscope: నేటి రాశి ఫలాలు మే 18, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 18 May 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 18వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2021, 07:34 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు మే 18, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 18 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 18వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పొదుపు చేయడం ప్రారంభించకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. స్నేహితుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. మానసిక ప్రశాంతత కోసం థ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులు, ఉద్యోగులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

వృషభ రాశి
భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో గొడవలకు దారి తీస్తుంది. నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. పనిచేసే చోట కష్టతరమైన టాస్క్ మీకు అప్పగిస్తారు. అయినా వెనుకడుగు వేయకుండా బాధ్యతలు స్వీకరిస్తారు. నేడు మీరు వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తారు. డబ్బు సమకూర్చుకుంటారు..

మిథున రాశి
ఒక పనిని స్వీకరించాలంటూ కుటుంబసభ్యులు మిమ్మల్ని చుట్టుముడతారు. కనీసం వారికి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే  పరిస్థితి ఉండదు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి.  ఆస్తిని చేజిక్కుంచుకునేందుకు కొంతమేర ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తారు. వ్యాపారాలు అంతంతమాత్రంగానే ఉంటాయి.

కర్కాటక రాశి 
నేడు మీ కుటుంబంతో గడపడానికి కొంత సమయం కేటాయించండి. వారు మీకు ఎన్నో విషయాలు చెప్పాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో మార్పులు కోరుకుంటారు. దీనిపై కీలక సమాచారం తెలుసుకుని ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. 

సింహ రాశి
పనిలో మీరు కచ్చిత్వంతో పని చేస్తారు. అది మీ పనికి గుర్తింపు తీసుకొస్తుంది. విద్యార్థులు తమ కెరీర్ గురించి కొందరు పెద్దవారిని కలేసుకుని పలు విషయాలపై చర్చలు జరుపుతారు. కొందరు తాము కోరుకున్న ప్రేమను పొందుతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితం రాదు.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

కన్య రాశి
మీరు ఎంచుకున్న ఓ ముఖ్యమైన విషయంలో కుటుంబసభ్యుల నుంచి  మద్దతు ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వారిని అదృష్టం వరించనుంది. మీరు చేపట్టిన పనులు నేడు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకున్న మేర ఫలితాలు వచ్చే దశకు చేరుకుంటాయి. అవసరమైన కీలక వస్తువులు, ఇంటి ఉపకరణాలు కొనుగోలు చేయడానికి సిద్ధపడతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

తులా రాశి
మీ మాటతీరు, వ్యహారశైలి కారణంగా సమాజంలో మీకు ఎల్లప్పుడూ గౌరవం లభిస్తుంది. కొన్ని పెట్టుబడులు మీకు లాభాలు తీసుకొస్తాయి. కొన్ని విషయాలపై ఆలోచించి ఆందోళన చెందవద్దు. నిరుద్యోగులకు అర్హతకు తగిన ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమను నమ్ముకుని, నిజాయితీగా వ్యవహరిస్తే అంతా మీకు అనుకూలమే.

వృశ్చిక రాశి
ఇంట్లో తలెత్తుతున్న సమస్యలపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైంది. మీ సృజనాత్మకతో వాటికి పరిష్కారం కనుగొంటారు. మీ నాయకత్వ లక్షణాలతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి
కుటుంబసభ్యులు మీ అభిప్రాయాలతో ఏకీభవించరు. కొన్ని ప్రశ్నలు మీకు చికాకు తెప్పిస్తాయి. మరోవైపు ఈ సమయంలో ప్రయాణాలు చేయడంతో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. పనిచేసే చోట సీనియర్ ఉద్యోడులు మీపై విశ్వాసం కలిగి ఉంటారు. ప్రాజెక్టులలో మీ సాయం తీసుకుని పనులు పూర్తి చేయనున్నారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

మకర రాశి
నేడు మకర రాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. మీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలకు ఓ పరిస్కారం దొరుకుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు కెరీర్‌లో మరో ముందుడుగు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. 

కుంభ రాశి
అనవసర ఖర్చులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తప్పవు. మీకు విలువైన, అవసరమైన వాటికి మాత్రమే నగదు వెచ్చించడం మొదలుపెట్టాలి. నేటి మీ పనులలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రయాణాలు చేయక తప్పదు. ఇళ్లు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులకు ఆశించిన మేర లాభాలు అందుకుంటారు.

మీన రాశి
మీరు వెళ్తున్న మార్గంలో ఫలితాలు పొందలేని సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి నుండి కోరుకున్నట్లుగా వంద శాతం లాభాలు పొందలేము. అయితే వచ్చిన లాభాలతో సంతోషంగా ఉండాలి. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఆర్థిక సరిస్థితులపై సమీక్షించుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News