Horoscope Today: ఇవాళ ఈ మూడు రాశులకు గుడ్ టైమ్ నడుస్తోంది..

Horoscope Today: ఈరోజు చాలా మందికి మిశ్రమ కాలం నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని రాశులవారు బాగా కష్టపడి పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. మరి ఇవాళ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 07:02 AM IST
  • నేటి రాశిఫలాలు
  • కొందరికి శుభం, మరికొందరికి అశుభం
Horoscope Today: ఇవాళ ఈ మూడు రాశులకు గుడ్ టైమ్ నడుస్తోంది..

Horoscope Today, 18 November 2022: మనం ఏదైనా పనిని ప్రారంభించినా లేదా శుభకార్యం తలపెట్టినా ఆ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. మరి నవంబరు 18న రాశిఫలాలు (Horoscope on 18th November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

మేష రాశి (Aries)- ఈరోజు మీకు మిశ్రమ కాలం నడుస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇవాళ మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. 
వృషభ రాశి (Taurus)- ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం మంచిది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు చేపట్టే పనుల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోండి. 
మిథున రాశి (Gemini)- వీరికి కూడా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోండి. వివాదాల జోలికి పోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. 
కర్కాటక రాశి (Cancer)- ఈరాశివారు కష్టించి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నిర్లక్ష్యం వహించొద్దు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 
సింహ రాశి (Leo)- వీరికి మంచి కాలం నడుస్తోంది. ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ వీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోంటారు. 
కన్య రాశి (Virgo- ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
తుల రాశి (libra)- ఈరోజు ఈరాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. మీ పనితో మీరు ఇతరులను ఆకర్షిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio)-  కష్టపడి పనిచేస్తే కానీ మంచి ఫలితాలు రావు. ఇతరులను కలుపుకోని పోవడం వల్ల మీ పనులను త్వరగా పూర్తి చేస్తారు. అనవసర విషయాల జోలికి పోకండి. 
ధనుస్సు రాశి (Sagittarius)- వీరికి శుభకాలం నడుస్తోంది. ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకర రాశి (Capricorn)- ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా మీ ఆత్మవిశ్వాసం దానిని పూర్తిచేస్తారు. ఒత్తిడికి గురికాకుండా ఉండండి. 
కుంభరాశి (Aquarius)- ఈరోజు మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఒక గుడ్ న్యూస్ పంచుకునే అవకాశం ఉంది. మెుదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
మీన రాశి (Pisces)- ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎవరినీ అతిగా నమ్మద్దు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. 

Also Read: December Horoscope: డిసెంబర్ నెలలో మారనున్న ఆ రాశి జాతకం, ఎలా ఉండనుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News