Horoscope Today 21 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 21న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీరు ఈ రోజు రిగ్గా ప్లాన్ చేస్తే గొప్ప సమయాన్ని ఆస్వాదిస్తారు. కొన్ని అనూహ్య పరిణామాలు చోటచేసుకుంటాయి. మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా మీరు ఏం చేయాలనుకున్నారో నిర్ణయించుకుని అడుగు వేయాలి. ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఉద్యోగులకు కాస్త ఊరట కలుగుతుంది.
Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే
వృషభ రాశి
మీ ఆలోచనలు ప్రస్తుతం మిమ్మల్ని నిరాశపరుస్తున్నాయి. మీరు పట్టింపు లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చిన్న విషయాలపై చింతించటానికి బదులుగా పెద్ద విషయాల కోసం యత్నించండి. ప్రాజెక్ట్ పూర్తి చేయలేదా? అయితే మరింత శ్రద్ధ వహించండి. మీ అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టండి మరియు ధ్యానం చేయడానికి సమయాన్ని కేటాయించాలి.
మిథున రాశి
ఈ రోజు మీరు నిజంగా ఏమి చేశారో ఇతరులకు చూపించే అవకాశం ఉంటుంది. చాలా సార్లు, మీ దగ్గర పనితనం లేదని ప్రజలు అనుకోవచ్చు, కాని ఈరోజు మీరేంటే ఏంటో అందరూ తెలుసుకుంటారు. పనిలో మరియు ఇంట్లో కూడా మీ నైపుణ్యాలను ప్రదర్శించగలరు. నూతన ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం.
కర్కాటక రాశి
మీరు ఎదురుచూస్తున్నది ఈ రోజు మీ వద్దకు రాబోతోంది. మీరు కొంతకాలంగా చాలా ఓపిక కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకోండి. నేడు మీకు మేలు జరగనుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో రుణాల కోసం యత్నిస్తారు.
Also Read: Non-Veg పిజ్జా డెలివరీ, 1 కోటి రూపాయాలు పరిహారం కోరిన మహిళ, అమెరికా ఔట్‌లెట్‌కు నోటీసులు
సింహ రాశి
ఈ రోజు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి పనిలో కాస్త భిన్నంగా వ్యవహరిస్తారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారు మరియు వారు బహుశా మీ వైపు చూస్తున్నారు. ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇతరులను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. ఆస్తిలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. ఇది భవిష్యత్తులో మీ అదృష్టాన్ని ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది.
కన్య రాశి
మీరు ఈ రోజు సహాయాన్ని కోరతారు. కొన్ని కారణాలతో ఏదో కోల్పోయినట్లు అనిపించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాలి. మీకోసం కొంత సమయం కేటాయించి పరిస్థితులపై ఆలోచన చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు.
తులా రాశి
కొన్ని జ్ఞాపకాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసి ఉంటుంది. అయితే వాటి కారణంగా భవిష్యత్‌పై ఆశలు వదులుకోవద్దు. మీకు ఈరోజు ఓపిక అధికంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు.
వృశ్చిక రాశి
కొందరు మిమ్మల్ని కేంద్రంగా చేసుకోవాలని ప్రయత్నిస్తారు. వారి అవసరాలకు మీ వద్దకు రావాలని భావిస్తారు. ప్రతి ఒక్కరిని విశ్వసించవద్దు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. సకాలంలో పనులు పూర్తికావు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుస్సు రాశి
తప్పు ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తారు. మానసిక ప్రశాంత కోసం గొప్ప మార్గం ధ్యానం చేయడం. మీరు సంతోషంగా ఉన్నారని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పేందుకు యత్నిస్తారు. వ్యాపారాలకు లాభసాటిగా ఉండనుంది. చేపట్టిన పనులలో ముందడుగు వేయనున్నారు.
Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా
మకర రాశి
ఈ రోజు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎవరో మిమ్మల్ని తప్పుడు మార్గంలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సూచనలు మీకు ముందుగానే జరగబోయే పరిణామాలను హెచ్చరిస్తాయి. వాటిని విస్మరించడానికి ప్రయత్నించడం మంచి నిర్ణయం కాదు.
కుంభ రాశి
ఈరోజు మీకు లాభదాయకంగా ఉంది. మీ చుట్టూ ఉన్నవారు మీరు ఎవరో తెలుసుకోబోతున్నారు. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరమైన సమస్యలు తీరనున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో ఒత్తిడి ఎదుర్కొంటారు.
మీన రాశి
మీ ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ మీ మానసిక బలం క్షీణిస్తోంది. మీకోసం కొంత సమయం కేటాయించుకుని యోచించాలి. స్వతంత్రంగా ఉండటంపై దృష్టి పెట్టండి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook