Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 28, 2021 Rasi Phalalu, వారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 28 February 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2021, 07:59 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 28, 2021 Rasi Phalalu, వారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 28 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 28న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఇతరుల అభిప్రాయాలు ఈ రోజు మీ జీవితంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. మీరు చాలా విషయాల గురించి ఆలోచిస్తారు. మీ జీవితాన్ని మార్చుకునేందుకు ఎక్కడ మార్పు రావాలో తెలుసుకుంటారు.  ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. చేపట్టే పనులు నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. 

Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు

వృషభ రాశి
మీ జీవితంలో చాలా లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. అయితే కొన్ని మాత్రమే సాధించగలరని గ్రహించి ముందుకు సాగుతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అధికంగా శ్రమించినా చేపట్టిన పనులలో జాప్యం, వాయిదా పడుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. దైవచింతన పెరుగుతుంది.

మిథున రాశి
మీ మనసులో మాటను ఇష్టపడిన వారితో పంచుకునే రోజు ఇది. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో వారికి మొత్తం వివరిస్తారు. అవతలి వ్యక్తుల నిర్ణయంతో మీ మనసు తేలిక అవుతుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ఆశాజనకర ఫలితాలు వస్తాయి. ఆకస్మిక ధనలాభంతో ఊరట చెందుతారు.

కర్కాటక రాశి
మీరు ఈ రోజు చాలా మంది కొత్త మరియు ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకోనున్నారు. వారి నుంచి కేవలం మంచిని మాత్రమే గ్రహించాలని తెలుసుకోండి. వారి అనుభవాలతో మీ జీవితంలో కొత్త అడుగులు వేయనున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబసభ్యులతో విభేదాలు వస్తాయి. ఆచితూచి వ్యవహించడం శ్రేయస్కరం. ప్రయాణాలు చేయడం అనారోగ్యానికి కారణంగా మారవచ్చు.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

సింహ రాశి
కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీరు గడిపే సమయం ఎప్పుడూ వృధా కాదు. నేర్చుకునేందుకు వీలు చిక్కితే అసలు వదులుకోవద్దు. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. నేడు మీకు వాహనయోగం లేదా వస్తు, ధన లాభాలు చేకూరనున్నాయి. నూతన అవకాశాలు పట్టుకుని ముందుకు సాగండి.

కన్య రాశి
మీరు పెద్ద వస్తువులు, లేదా ఆస్తులు కొనుగోలు చేయనున్నారు. అయితే మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. జరిగిపోయిన నిర్ణయాన్ని ఎలాగూ మార్చలేరని గ్రహించండి. ఉద్యోగులకు అంతగా కలిసిరాదు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. నేడు దైవదర్శనాలతో ధనవ్యవయం చేసే అవకాశాలున్నాయి. కుటుంబంలో కొన్ని గొడవలు తలెత్తుతాయి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి.

తులా రాశి
కొన్నిసార్లు మీదే పైచేయి కావాలనిన మొండి పట్టుదల ప్రదర్శిస్తారు. అయితే ఇతరులకు కూడా అవకాశం వస్తుందని మరిచిపోవద్దు. నేడు ఒంటరిగా గడపాలని భావిస్తారు. తద్వారా మనసు తేలిక అవుతుంది. శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు సత్ఫలితాలు వస్తాయి. నూతన పరిచయాలతో అంతా మేలు జరుగుతుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. 

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

వృశ్చిక రాశి
మీరు ఈ రోజు చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కనుక చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. ప్రముఖుల పరిచయంతో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు చాలా విషయాలలో కలిసొస్తుంది. ఉద్యోగులకు కార్య జయం, వ్యాపారులకు లాభం చేకూరనుంది.

ధనుస్సు రాశి
నేడు మీ పనుల కోసం జాబితాను సిద్ధం చేసుకుంటారు.  మీరు ఆస్వాదిస్తూ పనులు పూర్తిచేయనున్నారు. మీరు చాలా సరదాగా గడుపుతారు. అయితే ధనవ్యయం కారణంగా అధికంగా శ్రమిస్తారు. ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పరిస్థితులు అనుకూలించకపోవడంతో దైవచింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. 

మకర రాశి
మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారితో స్నేహం చేస్తుంటారు. అయితే అలాంటి భిన్నమైన వ్యక్తితో మీరు ఉండవలసిన అవసరం లేదని తెలుసుకుంటారు. మీలాగ ఆలోచించే వారితో స్నేహంతో అంతా మేలు జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల రాకతో ధనవ్యయం కానుంది.

కుంభ రాశి
మీరు ఓ స్నేహితుడి కోసం చాలా చేస్తారు. అయితే అతడి నుంచి ఏ ప్రతిఫలం ఆశించరు. వ్యూహాత్మకంగా వ్యవమరించడంతో మీ బాకీలు తీరనున్నాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకావం ఉంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునే సమయం ఇది అని భావిస్తారు.

మీన రాశి
మీ ప్రస్తుత పరిస్థితి కారణంగా గందరగోళానికి గురవుతారు. కానీ మీరు అలాంటి ప్రదేశంలో ఉండటం సరైనదా కాదా? అని గ్రహించాలి. బాల్య స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. వ్యాపారులు, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News