Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 9, 2021 Rasi Phalalu, ఓ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Horoscope Today 9 March 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2021, 08:02 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 9, 2021 Rasi Phalalu, ఓ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Horoscope Today 9 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 9న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీరు గతాన్ని గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో కొన్ని విషయాల కారణంగా మీరు బాధపడవచ్చు. మీరు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని గ్రహిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. చెడుకు బదులుగా మంచి విషయాలను చూడండి. కెరీర్ వారీగా ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలు సైతం స్వీకరించే అవకాశాలు గోచరిస్తున్నాయి.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది 

వృషభ రాశి
మీరు అధికంగా శ్రమించినా ఫలితాలను అందుకోలేకపోతారు. కొన్నిసార్లు విషయాలు నెమ్మదిగా జరుగుతాయని గ్రహిస్తారు. అందువల్ల మీరు వెనకడుగు వేయవద్దు. నేడు కొన్ని మంచి విషయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆస్తి, వ్యాపార విషయాలు సమస్యలకు దారితీస్తాయి. దైవచింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శించేందుకు తగిన సమయంగా భావిస్తారు. కొన్ని విషయాలలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది.

మిథున రాశి
తొలుత మీతో సన్నిహితంగా మెలిగి ఆపై దూరమైన వారితో తిరిగి కనెక్ట్ అయ్యే సమయం ఆసన్నమైంది. కొందరు వ్యక్తులతో పరిచయం మీకు కొత్త ఉద్యోగ అవకాశాన్ని తెస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టులలో అవాంతరాల కారణంగా జాప్యం ఏర్పడుతుంది. .

కర్కాటక రాశి
ఈ రోజు మీరు చాలాకాలం నుంచి కోరుకుంటున్న దాన్ని సాధించవచ్చు. కొన్ని విషయాలలో మీరు భావోద్వేగాలను జయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, మీరు దాని గురించి ఎక్కువ యోచించాల్సిన పనిలేదు. సాధించిన విజయాలతో మీరు చాలా వినయంగా ఉండండి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి అంతా శుభాలే గోచరిస్తున్నాయి.

సింహ రాశి
ఈ రోజు మీ కుటుంబంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. మీ చుట్టూ ఉన్న పిల్లలతో మీరు చిరాకు పడవచ్చు. మీ భవిష్యత్తు నుండి మీకు ఏమి కావాలో ఆలోచించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారు? మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను ప్లాన్ చేయడానికి ఇది మంచి రోజు అని భావిస్తారు. సన్నిహితులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు, ఉద్యోగులకు లాభసాటిగా ఉంటుంది. 

కన్య రాశి
కన్య రాశి వారికి ఈరోజు చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఉదయం పనులు నెమ్మదిస్తాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాత మీరు పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. మీ జాబితాలో ఉన్న పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు. మీరు మీ భాగస్వామితో ఇంట్లోనే సరదాగా సమయం గడపాలని భావిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు మిశ్రమ, ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు సైతం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయనున్నాయి. 

తులా రాశి
మీరు గత కొంతకాలం నుంచి ఒకరిపై ప్రేమగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని వారికి చెప్పగా ఊహించని విధంగా స్పందనల లభిస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్నవారైతే పనిలో కొంత విశ్రాంతి తీసుకోవాలనుకోవచ్చు. మీ పనులను ఇతరులకు అప్పగిస్తారు. మీ నాయకత్వ నైపుణ్యాలు భవిష్యత్ ప్రాజెక్టులకు మార్గాన్ని చూపిస్తాయి. రుణభారం అధికం కానుంది. బంధువులతో విభేదాలు చికాకు తెప్పిస్తాయి.

వృశ్చిక రాశి
ఈరోజు పనులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. దాంతో మీలో ఆసక్తి కొంతమేర తగ్గనుంది. అయినా పట్టుదలతో శ్రమించి సకాలంలో ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. మీరు ఇంటికి చేరుకున్న తర్వాత ఆసక్తికర వార్త వింటారు. ఇతరులను కలవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి రోజు. వృశ్చిక రాశి వారికి నేడు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులు నేడు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు. 

ధనుస్సు రాశి
మీ చుట్టుపక్కల వారు ఈ రోజు మీ నాయకత్వ నైపుణ్యాలకు ఆకర్షితులు కానున్నారు. మీ నిర్ణయాలకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లాంటివి లభించవచ్చు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులు మీతో చర్చించి మీ నిర్ణయాన్ని సైతం ఆచరించేందుకు సిద్ధమవుతారు. ఆర్థిక సమస్యల కారణంగా రుణాల కోసం యత్నిస్తారు. 

మకర రాశి
మీ వ్యక్తిగత జీవితాన్ని, ఆఫీసు పనులను కలపడానికి ఇష్టపడరు. ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటారు. 

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

కుంభ రాశి
ఈ రోజు మీరు చాలా కఠినమైన సమస్యలను చాలా తేలికగా పరిష్కరించుకుంటారు. ఈరోజు మీకు సత్ఫలితాలు గోచరించడం లేదు. మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరిని విందు లేదా శుభకార్యాలకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మీన రాశి
మీరు ఈరోజు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఇది మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆటంకం కలిగిస్తుంది. అవసరమైతే ఇతరుల నుండి సహాయం తీసుకోవడం ఉత్తమం. అయితే ఎవరితో సాయం తీసుకుంటున్నారో కూడా ఆలోచించాలి. ప్రతి విషయాన్ని ఇతరులపై నెట్టరాదు. కొందరు మీ నిర్ణయాలను ఆహ్వానిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓ పనిలో మీకు ఆకస్మిక ధనలాభం. కొందరు మీ స్నేహాన్ని కోరుకుంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News